ETV Bharat / state

BRS Sarpanch in Maharashtra : మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ తొలి విజయం.. సర్పంచ్ స్థానం ఏకగ్రీవం

author img

By

Published : Jun 24, 2023, 7:07 PM IST

BRS
BRS

BRS Candidate Sushma Vishnu Mule Elected Sarpanch At Savkheda : బీఆర్​ఎస్​ పార్టీ మహారాష్ట్రలో విజయం సాధించింది. అదేంటని ఆలోచిస్తున్నారా.. అక్కడ గంగాపూర్​ సావేేఖేడా గ్రామ పంచాయతీ ఎన్నికలో బీఆర్​ఎస్​ అభ్యర్థి సుష్మా విష్ణు ములే సర్పంచ్​గా గెలుపొందారు.

BRS Won Post Of Sarpanch In Maharashtra : మహారాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన బీఆర్​ఎస్​.. బోణి ప్రారంభించింది. తొలి ప్రయత్నంలో సర్పంచ్​ పదవిని సొంతం చేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్​ జిల్లా గంగాపూర్​లోని సావ్​ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్​ ఎన్నికలో బీఆర్​ఎస్​ బలపరిచిన సుష్మా విష్ణు ములే సర్పంచ్​గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ సర్పంచ్​ అభ్యర్థి ఏకగ్రీవం
మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ సర్పంచ్​ అభ్యర్థి ఏకగ్రీవం

సుష్మా విష్ణు ములే సర్పంచ్​గా ఎన్నికవ్వడంతో.. బీఆర్​ఎస్​ పార్టీ మహారాష్ట్రతో పాటు గంగాపూర్​ ఖుల్తాబాద్​ అసెంబ్లీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టినట్లు అయింది. ఈ ఎంపిక ప్రక్రియను స్వయంగా బీఆర్​ఎస్​ నాయకులు పర్యవేక్షించి.. గ్రామ పంచాయతీ సర్పంచ్​ ఎంపిక ప్రక్రియను చేశారు. సర్పంచ్​ ఎన్నికలో సభ్యులందరి తరఫున సుష్మా విష్ణు మూలేనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ అడుగుపెడుతూ.. తన ఉనికి చాటుకుంటుంది.

BRS Sarpanch In Maharashtra : మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే.. భారత రాష్ట్ర సమితి అక్కడి రాజకీయాల్లోకి బలంగానే ప్రవేశించిందని చెప్పవచ్చు. అక్కడ పార్టీ సర్పంచ్​ అభ్యర్థి ఏకగ్రీవం అవ్వడానికి ప్రధాన కారణం.. రైతుల సమస్యలు, కరెంటు సమస్యలు, నీటి సమస్యలు వంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి బీఆర్​ఎస్​ పనులను ప్రారంభించింది. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే పార్టీల్లో కేసీఆర్​ కూడా ముందు వరుసలో ఉండడం కూడా గెలవడానికి ఆస్కారం అయ్యింది. అందుకే గంగాపూర్​ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ పార్టీలోకి అధిక సంఖ్యలో ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరుతున్నారు.

BRS Sarpanch At Sawkheda Gram Panchayat : మహారాష్ట్రలో ఉద్ధవ్​ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు.. సీఎం కేసీఆర్​ ఆయనను కలిసి.. పలు విషయాలపై మాట్లాడే వారు. తర్వాత పార్టీని స్థాపించి.. మొదటి సమావేశం కూడా మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లోనే ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలోనే బీఆర్​ఎస్​ అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో అధికార పార్టీపై విమర్శలు చేస్తూ.. తెలంగాణ మోడల్​ను ఇక్కడ ప్రవేశపెడతామని బహిరంగ సభల్లో హామీ ఇచ్చేవారు.

తెలంగాణ అభివృద్ధిని చూసే.. మహారాష్ట్రలో గెలుపు : బహుజనుల కోసం కేసీఆర్​ తీసుకువస్తున్న పథకాలు, సంక్షేమాలను చూసి అక్కడి ప్రజలు ఆకర్షితులయ్యారు. గంగాపూర్​ నియోజవర్గంలో సభ ఏర్పాటు చేస్తే.. అధిక సంఖ్యలో సమావేశానికి హాజరవుతున్నారు. దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్​, సాగు నీరు వంటి పథకాలను కూడా మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే అందిస్తామని జరిగే సమావేశాల్లో కేసీఆర్​ చెప్పుకుంటూ వచ్చేవారు. ఇదే ఇప్పుడు అక్కడ బీఆర్​ఎస్​ సర్పంచ్​ ఏకగ్రీవం అవ్వడానికి దోహదపడింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.