CM KCR Speech at BRS Training Camp : 'దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్​ఎస్ ఆవిర్భావం'

author img

By

Published : May 19, 2023, 3:40 PM IST

CM KCR

CM KCR Speech at BRS Training Camp in Nanded : దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్​ఎస్ ఆవిర్భవించిందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మన చుట్టు పక్కల ఉన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో రోజూ మంచి నీరు ఇవ్వలేని దుస్థితి ఉందని మండిపడ్డారు. రైతులంటే గౌరవం లేదా.. నిత్యం పోరాడుతూనే ఉండాలా అని ప్రశ్నించారు.

CM KCR Speech at BRS Training Camp in Nanded : దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌.. వారికి దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ను కోరుకుంటుంది..: ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన చుట్టు పక్కల ఉన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో రోజూ మంచి నీరు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌.. ఇలా పాలకులు మారినా భారత్‌లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ను కోరుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

'దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్​ఎస్ ఆవిర్భవించింది. చాలా చిన్న దేశాలైన సింగపూర్‌, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కర్ణాటక ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నాం. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. వ్యవసాయానికి నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.'-సీఎం కేసీఆర్‌

రైతులంటే గౌరవం లేదా..: అకోలా, ఔరంగాబాద్‌ వంటి ప్రాంతాల్లో వారానికోసారి తాగునీరు వస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశం మొత్తం దాదాపు ఒకే తరహా పరిస్థితి ఉందన్న ఆయన.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున రైతు ఉద్యమాలు జరిగాయని పేర్కొన్నారు. శరద్ జోషి నాయకత్వంలో పెద్దఎత్తున రైతు ఉద్యమం జరిగిందన్నారు. ఆందోళనల్లో ఎందరో రైతులు తూటాలకు బలయ్యారన్న కేసీఆర్.. నాసిక్ నుంచి ముంబయి వరకు రైతులు పాదయాత్ర చేశారని తెలిపారు. రైతులంటే గౌరవం లేదా.. నిత్యం పోరాడుతూనే ఉండాలా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.

'తెలంగాణలో ఏడేళ్ల కృషితోనే ఎన్నో సమస్యలు పరిష్కరించాం. నోట్ల రద్దుతో ఒక ఏడాది, కరోనాతో మరో ఏడాది ఇబ్బందిపడ్డాం. తెలంగాణలో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నాం. పట్టణాల్లోనూ ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నాం. తెలంగాణలో సాధ్యమైంది మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు. యవత్మాల్‌ జిల్లాలో రోజుకో రైతు ఆత్మహత్య ఉంటుంది. మహారాష్ట్ర- తెలంగాణ మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది.' - ముఖ్యమంత్రి కేసీఆర్‌

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో రోజూ మంచి నీరు ఇవ్వలేని దుస్థితి: కేసీఆర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.