ETV Bharat / business

'బిగ్ సేవింగ్ డేస్​' పేరుతో సూపర్​ సేల్​కు ఫ్లిప్​కార్ట్ సిద్ధం - ఈ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్స్! - Flipkart Big Saving Days Sale 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 12:10 PM IST

Flipkart Big Saving Days Sale 2024
Big Saving Days

Flipkart Big Saving Days Sale : సమ్మర్​లో మంచి ఏసీ కొందామనుకుంటున్నారా? లేదంటే ఇంకేదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే, షాపింగ్​కు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' పేరుతో సూపర్​ సేల్​కు సిద్ధమైంది. వారం పాటు ఈ సేల్ కొనసాగనుంది. మరి, ఎప్పటి నుంచో తెలుసా?

Flipkart Big Saving Days Sale 2024 : సమ్మర్​ వచ్చిందంటే చాలు ఈ-కామర్స్ సంస్థలు సేల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్(Flipkart).. "బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ (Big Saving Days)" ఆఫర్ల పండగకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించింది. అంతేకాదు, కొన్ని బ్యాంకుల కార్డులతో షాపింగ్ చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్స్​ అందించనున్నట్లు తెలిపింది. ఇంతకీ, బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఏ ఏ కార్డులపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్ ఫ్లిప్​కార్ట్ నిర్వహించనున్న.. 'బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌(Big Saving Days Sale)' మే 3వ తేదీన మొదలుకానుంది. వారం రోజులపాటు అంటే మే 9వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనున్నట్లు ఫ్లిప్​కార్ట్ కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్లిప్​కార్ట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్​ ఫోన్స్(Smart Phones) నుంచి మొదలుపెడితే ల్యాప్​టాప్​లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. కాబట్టి, సమ్మర్​లో షాపింగ్​కు సిద్ధమవుతున్న వారికి ఇది బంపర్ బోనాంజాగా చెప్పుకోవచ్చు.

ఇకపోతే.. మే 3 నుంచి 9 వరకు కొనసాగే 'బిగ్ సేవింగ్ డేస్ సేల్'​ ఫ్లిప్​కార్ట్ ప్లస్ మెంబర్​షిప్ యూజర్లకు ఒకరోజు ముందుగానే స్టార్ట్ అవుతుందని కంపెనీ తెలిపింది. అంటే.. వారు మే 2 నుంచే ఈ సేల్​లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

వాట్సాప్ నయా కాలింగ్ ఫీచర్​ - నంబర్ లేకున్నా ఫోన్​ చేయొచ్చు! - WhatsApp In App Dialer

ఆ బ్యాంక్ కార్డులు ఉన్నవారికి ప్రత్యేక డిస్కౌంట్స్!

  • బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్​లో భాగంగా.. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అందించనున్నట్లు తన వెబ్‌సైట్లో పేర్కొంది ఫ్లిప్‌కార్ట్‌.
  • అదేవిధంగా.. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, అలాగే వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు కూడా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్ ప్రకటించింది.
  • అలాగే.. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది. వీటితో పాటు యూపీఐ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది ఫ్లిప్​కార్ట్.
  • అయితే.. ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్​ డేస్​ సేల్​లో భాగంగా ఆయా ఉత్పత్తులపై అందించనున్న ఆఫర్లను కంపెనీ ఇంకా రివీల్‌ చేయలేదు. ముఖ్యంగా.. ఈ సేల్​లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలుస్తోంది.

బోట్ నుంచి అదిరిపోయే స్మార్ట్​వాచ్ రిలీజ్ - SOS, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ - ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.