ETV Bharat / health

చిప్స్ టు వైన్- ఆరోగ్యానికి మేలు చేసే అన్​హెల్తీ ఫుడ్స్​ ఇవే! - Benifits With Unhealthy Foods

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 12:39 PM IST

Surprising Benifits With Unhealthy Foods
Surprising Benifits With Unhealthy Foods

Benifits With Unhealthy Foods : చాక్లెట్లు, చిప్స్, కేకులు, బ్రెడ్డు వంటి వాటిని ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని, వీటిని దూరంగా ఉండాలని తరచూ భయపడాల్సి వస్తుంది. ఈ అనారోగ్యకరమైన ఆహారాలతో కూడా కొన్ని ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

Benifits With Unhealthy Foods : చాకెట్లు, చిప్స్, సాల్టెడ్ స్నాక్స్ వంటి ఆహార పదార్థాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ బాగా నచ్చుతాయి. చూడటానికి ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, వీటిని తినడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని చాలా మంది చెబుతుంటారు. అందుకే ఇవి ఎంత ఇష్టమైనవి అయినప్పటికీ, తినడానికి చాలా మంది భయపడుతుంటారు. చాలా మంది ఇష్టపడే ఈ అనారోగ్యకరమైన ఆహారాలతో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు నిరూపించాయట. అలా చిప్స్ నుంచి రెడ్ మీట్, శాండ్ విచ్, వైన్ వరకూ మన ఆరోగ్యానికి మేలు చేసే అనారోగ్యకరమైన ఆహారాలేంటి వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మితంగా చేస్తే ఏదైనా మంచి ఫలితాలనే ఇస్తుంది. అలాగే లిమిట్ దాటితే ఏదీ మంచిది కాదు. మనం తినే ఆహారాలు, తాగే పానీయాల విషయంలో కూడా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఇది. వాస్తవానికి మనం చెడు ఆహారాలుగా భావించే చాలా ఆహార పదార్థాలు మితంగా తింటే మనకు ఎలాంటి హాని చేయవట. నచ్చాయి కదా అని వీటిని ఎక్కువగా తినడం వల్ల మాత్రమే ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే.

1. చిప్స్
బయట ప్రాసెస్ చేసినవి కాకుండా బంగాళాదుంపలు, నూనెతో ఇంట్లోనే మీరు చిప్స్ తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందట. వీటిలో విటమిన్-ఈ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందట. అలాగే దీంట్లోని ఫైబర్ అరుగుదల సమస్యలు రాకుండా చేస్తుందట. రోజులో దాదాపు 150గ్రాముల వరకు వీటిని తినడం వల్ల ఎలాంటి హాని కలుగదని, అంతకు మించి తింటేనే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

Benifits With Unhealthy Foods
చిప్స్

2. కేక్
కేక్ అంటే పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా ప్రియమైన ఆహారమే. నిజానికి కొన్ని కేకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. మీరు ఇంట్లోనే ఫ్రూట్స్, పాలు, గుడ్లతో కేక్ తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగదట. పండ్లలోని ఐరన్ మీ శరీరానికి కావాల్సిన ఐరన్​ను అందిస్తుందట. ఫ్రూట్స్​లోని సహజమైన తీపిదనం కారణంగా ఈ కేక్​లో చెక్కర కూడా తక్కువగా పడుతుందట.

Benifits With Unhealthy Foods
కేక్

3. చీజ్
చీజ్ తినే వారు లావు అవుతారనీ, ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది భయపడతారు. నిజానికి దీనిలో సంతృప్త కొవ్వులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారట. అలాగే ఇది గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను పెంచి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుందట. చీజ్​లో బ్యూటిరేట్ అనే సమ్మేళనం జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే దీంట్లోని కాల్షియం, ప్రోటీన్లు కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహయపడతాయి.

Benifits With Unhealthy Foods
చీజ్​

4. శాండ్ విచ్
శాండ్ విచ్ అంటే ఇష్టపడే వారికి ఇది శుభవార్త అనే చెప్పుకోవాలి. దీన్ని తృణధాన్యాలు, గోధుమ పిండితో వంటి పదార్థాలు కలిగిన వైట్ బ్రెడ్​తో తయారు చేస్తారు. వైట్ బ్రెడ్ రక్తంలో చెక్కర స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలు పెంచుతుందని అంతా చెబుతుంటారు. కానీ ఇప్పటివరకు దీన్ని రుజువు చేసిన వారు లేరు. వాస్తవానికి తృణధాన్యాలు తక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మితంగా తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు, ఇన్సులిన్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు ఉండవు. పైగా దీంట్లోని ఫైబర్, ఇతర కూరగాయలు ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Benifits With Unhealthy Foods
సాండ్​విచ్

5. రెడ్ వైన్
పాలీఫెనాల్స్ కలిగి ఉన్న రెడ్​వైన్​లో ఒక గ్లాసుకు అంటే 175 మిల్లీ లీటర్లకు 1.6 మిల్లీ గ్రాముల ఐరన్ కలిగి ఉంటుందట. వీటిలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయట. దీంట్లోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుందట. కొన్ని అధ్యనాల్లో తెలిసిన విషయం ఏంటంటే, రెడ్ వైన్ మితంగా తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గించడంలో సహాయపడుతుందట.

Benifits With Unhealthy Foods
రెడ్​ వైన్

6. పాస్తా
పాస్తా లాంటి పిండి పదార్థాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆహార నియమాల ప్రకారం మనం తినే ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు, పిండి, తృణధాన్యాలు తప్పకుండా ఉంటాయి. పాస్తాలో ఇవన్నీ ఉంటాయి. వాస్తవానికి పాస్తాను మితంగా తినడం వల్ల గ్లైసిమిక్ స్థాయిలు అదుపులో ఉండటమే కాక దీంట్లోని ఫైబర్​ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Benifits With Unhealthy Foods
పాస్తా

వీటితో పాటు రెడ్ మీట్, కాఫీ, ఫ్రెంచ్ ఫ్రైస్, చాకొలెట్లు, సలాడ్స్, బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్, వెన్న, పాప్ కార్న్ వంటి పదార్థాలు అన్నీ మితంగా తింటే మంచిదేనని, అమితంగా తీసుకుంటేనే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇంకేముంది, ఎంజాయ్ యువర్ ఫేవరేట్ ఫుడ్ విత్ ఇన్ యుఅర్ లిమిట్స్.

Benifits With Unhealthy Foods
చాక్లెట్​
Benifits With Unhealthy Foods
వైట్​ బ్రెడ్

ముఖ్యగమనిక: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.