జేబులో పేలిన మొబైల్ ఫోన్.. ఒక్కసారిగా మంటలు.. లైవ్ వీడియో చూశారా?

By

Published : May 19, 2023, 7:31 AM IST

thumbnail

ఓ వృద్ధుడి జేబులో ఉన్న కీ ప్యాడ్​ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అనంతరం షర్ట్​కు సైతం మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన వృద్ధుడు ఫోన్​ విసిరేసి.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. మొబైల్​ను కిందపడేసి మంటలను ఆర్పేశాడు. కేరళకు చెందిన ఇలియాస్(76) అనే వ్యక్తికి జేబులో ఈ ఫోన్​ పేలింది. ఇలియాస్​ ఓ హోటల్లో టీ తాగుతూ కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

త్రిస్సూర్ జిల్లాలోని మరోట్టిచల్ ప్రాంతంలో గురువారం దాదాపు 10 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ఇలియాస్​ తెలిపాడు. స్థానికంగా ఉన్న ఓ మొబైల్​ షాప్​లో వెయ్యి రూపాయలకు ఈ ఫోన్​ను కొనుగోలు చేసినట్లు అతడు​ వివరించాడు. సంవత్సరం కింద దాన్ని కొనుగోలు చేశానని ఇప్పటి వరకు ఎటువంటి ట్రబుల్​ ఫోన్​ ఇవ్వలేదని వెల్లడించాడు. ఘటనలో తనకు గాయాలు కాలేదని ఇలియాస్​ పేర్కొన్నాడు. హోటల్లో ఉన్న సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం ఈ నెలలో ఇది మూడో సారి కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.