ETV Bharat / state

Maharashtra leaders joined BRS: 'బీఆర్​ఎస్​లో చేరిన పలువురు మహారాష్ట్ర నేతలు'

author img

By

Published : May 5, 2023, 10:45 PM IST

Maharashtra leaders joined in BRS: బీఆర్​ఎస్​ జాతీయ పార్టీగా మారిన తరవాత మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో పలువురు నాయకులు బీఆర్​ఎస్​లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీలోకి మహరాష్ట్ర నుంచి వలసలు కొనసాగుతుండగా తాజాగా మరికొంత మంది మరాఠ నాయకులు కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.​

Maharashtra leaders joined BRS
Maharashtra leaders joined BRS

Maharashtra leaders joined in BRS: బీఆర్​ఎస్​ పార్టీకి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ చూసి ఆ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి గత కొద్ది రోజులుగా వివిధ పార్టీల నాయకులు బీఆర్​ఎస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన కొందరు నాయకులు సీఎం కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. ​

విదర్భ ప్రాంతానికి చెందిన పలువురు బీఆర్​ఎస్​లో చేరిక: శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ సమక్షంలో విదర్భ ప్రాంతానికి చెందిన పలువురు మరాఠ నేతలు బీఆర్​ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వార్ధా, ఆర్వి, రాంటెక్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పలువురు రైతు నాయకులు, విద్యావేత్తలు బీఆర్​ఎస్​లో చేరారు. స్వరాజ్ షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు జై కుమార్ శంకర్ రావు బల్కెడే, రాంటెక్ మున్సిపాల్టీ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కార్మోరె, మాజీ కార్పోరేటర్ ఉమేష్ మహాజన్, కొల్లాపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, యువరాజ్ ఆనంద్ రావు పాటిల్, కొల్లాపూర్ జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు ఆనంద్ బాలాసాహెబ్ హలందకర్, మహారాష్ట్ర రోజ్ ఘర్ పరిషత్ అధ్యక్షుడు విక్రమ్ జరాగ్, కొల్లాపూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంజలి జాదవ్, అధికార ప్రతినిధి రవీంద్ర కైరే, సర్పంచ్ అశోక్ రావు పాటిల్, ఉస్మానాబాద్ జెడ్పీ సభ్యులు ప్రకాష్ చౌహాన్ తదితరులు బీఆర్​ఎస్​లో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్​ఎస్ మహారాష్ట్రలో అడుగుపెట్టగానే.. అక్కడి ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచిందని.. వీఆర్​ఏ వ్యవస్థపై ఆలోచిస్తోందని పేర్కొంది. పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ మోడల్ అమలు చేస్తామనేందుకు.. ఆ రెండు విజయాలే నిదర్శనమని గులాబీ దళపతి తెలిపారు. మే 10న ఒకే సమయంలో 288 నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభించాలని ఆ రాష్ట్ర నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

గతంలో చేరిన నాయకులు: ఇటీవలే కొంత మంది మహారాష్ట్ర నాయకులు బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు నేతలు శరత్‌జోషి, ప్రణీత్‌, తదితరులను కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యావత్‌మామాల్‌ మాజీ ఎమ్మెల్యే రాజుతోడ్‌సమ్, ఔరంగబాద్ జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్లు పవన్‌ తిజారే, గజానన్ అందాబడ్కర్, ఆదివాసీల సంఘం అధ్యక్షుడు సూరజ్ ఆత్రం, దళిత సంఘాల ఔరంగబాద్ జిల్లా అధ్యక్షుడు అరవింద్ గోటేకర్ తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.