ETV Bharat / state

భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్టు... పోలీసులపై బండి సంజయ్ ఫైర్

author img

By

Published : Jun 10, 2022, 8:23 AM IST

భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంను కించపరుస్తూ డ్రామా వేయించిన కేసులో గురువారం అర్ధరాత్రి ఘట్‌కేసర్ వద్ద హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పోలీసుల తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. జిట్టా బాలకృష్ణారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి
జిట్టా బాలకృష్ణారెడ్డి

భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ వద్ద హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2 న అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభను జిట్టా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​ను కించపరుస్తూ డ్రామా వేయించారని జిట్టా బాలకృష్ణారెడ్డిపై తెరాస నేతలు చేసిన ఫిర్యాదుపై ఆయనను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక భాజపా కార్పొరేటర్లు, నేతలు హయత్​నగర్ పోలీస్​స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

జిట్టాను వెంటనే విడుదల చేయాలి: ఎలాంటి నోటీసులివ్వకుండా భాజపా నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్యబద్ధంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకునే హక్కులేదా? నోటీసులివ్వకుండా అర్ధరాత్రి హంతకుడు, దోపిడీ దొంగల మాదిరిగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమేంటని మండిపడ్డారు. వెంటనే జిట్టా బాలకృష్ణారెడ్డిని విడుదల చేయాలని పేర్కొన్నారు. ఆయనకు ఏం జరిగినా కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: Ktr letter to Modi: మోదీజీ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి?: కేటీఆర్

ఏటీఎం నగదు జమ చేస్తుండగా కత్తులతో బెదిరించి రూ.1.92 లక్షలు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.