ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్​లో రోహిత్, విరాట్ ఉండాల్సిందే- వాళ్లకు ఆ సత్తా ఉంది: గంగూలీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 5:43 PM IST

Updated : Jan 7, 2024, 6:00 PM IST

Rohit Kohli T20 World Cup: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్, విరాట్ 2024 టీ20 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా జట్టులో ఉండాల్సిందేనని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అలాగే ఈ టోర్నీలో రోహిత్ శర్మే టీమ్ఇండియాకు కెప్టెన్​గా ఉండాలని అన్నాడు.

Rohit Kohli T20 World Cup
Rohit Kohli T20 World Cup

Rohit Kohli T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​ షెడ్యుల్ రిలీజైన తర్వాత ఈ టోర్నమెంట్ గురించి క్రీడావర్గాల్లో చర్చ ఎక్కువైంది. ముఖ్యంగా భారత్ జట్టుకు ఎవరు కెప్టెన్​గా వ్యవహరిస్తారు? స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ టోర్నీకి ఎంపికవుతారా? అన్న ప్రశ్నలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ, ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

రానున్న టీ20 వరల్డ్​కప్ భారత జట్టులో రోహిత్, విరాట్ ఉండాల్సిందేనని గంగూలీ అన్నాడు. '2024 టీ20 ప్రపంచకప్ టీమ్ఇండియాకు రోహిత్ శర్మే కెప్టెన్​గా ఉండాలి. బీసీసీఐ కూడా 2007 ప్రపంచకప్​లా యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును రోహిత్​కు ఇవ్వాలి. విరాట్ కూడా జట్టులో ఉండాల్సిందే. విరాట్ అత్యుత్తమ ప్లేయర్. వీరిద్దరూ 14 నెలల తర్వాత కూడా టీ20ల్లో మంచి కమ్​బ్యాక్ ఇవ్వగలరు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్​లో యశస్వీ జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. అతడి కెరీర్​లో ఇది ప్రారంభం మాత్రమే. ఫ్యుచర్​లో జైశ్వాల్​కు అవకాశాలు పుష్కలంగా వస్తాయి. ఈ పర్యటనలో టీమ్ఇండియా అద్భతంగా ఆడింది. వన్డే సిరీస్​ను గెలుచుకొని, టీ20, టెస్టు సిరీస్​ను డ్రా చేసుకుంది. ఈ ఫలితాలే టీమ్ఇండియా బలమైన జట్టు అనేదానికి నిదర్శనం' అని గంగూలీ అన్నాడు.

ICC T20 2024 Schedule: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల 2024 టీ20 వరల్డ్​కప్ షెడ్యుల్ విడుదల చేసింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నమెంట్​ 2024 జూన్ 1న యూఎస్ఏ వర్సెస్ కెనడ మ్యాచ్​తో టోర్నీ ప్రారంభం కానుంది. ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా 29 రోజుల పాటు ఈ టోర్నీ సాగనుంది. మొత్తం రెండు సెమీస్, ఫైనల్ సహా టోర్నీలో 55 మ్యాచ్​లు జరగనున్నాయి. టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్​ భారత్- పాకిస్థాన్ జూన్ 9న తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్​కు న్యూయార్క్​ వేదిక కానుంది. కాగా, జూన్ 29న బర్బాడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2024 టీ20 పూర్తి షెడ్యుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీ20 వరల్డ్​కప్​ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్​- కెప్టెన్​ ఛాన్స్ అతడికే!

పొట్టి వరల్డ్ కప్​- భారత్‌ X పాక్‌ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

Last Updated :Jan 7, 2024, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.