ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ ఔట్​ - భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 7:26 PM IST

Updated : Jan 5, 2024, 8:56 PM IST

ICC T20 2024 Schedule: 2024 టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​ జూన్​ 9న జరగనుంది.

ICC T20 2024 Schedule
ICC T20 2024 Schedule

ICC T20 2024 Schedule: 2024 టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ శుక్రవారం ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నమెంట్​ 2024 జూన్ 1న యూఎస్ఏ వర్సెస్ కెనడ మ్యాచ్​తో టోర్నీ ప్రారంభం కానుంది. ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా 29 రోజుల పాటు ఈ టోర్నీ సాగనుంది. మొత్తం రెండు సెమీస్, ఫైనల్ సహా టోర్నీలో 55 మ్యాచ్​లు జరగనున్నాయి.ఇక టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్​ భారత్- పాకిస్థాన్ జూన్ 9న తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్​కు న్యూయార్క్​ వేదిక కానుంది. . కాగా, జూన్ 29న బర్బాడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

టోర్నీలో భారత్ గ్రూపు స్టేజ్ మ్యాచ్​లు

  • 4th జూన్ vs ఐర్లాండ్ - న్యూయార్క్
  • 9th జూన్ vs పాకిస్థాన్- న్యూయార్క్
  • 12th జూన్ vs యూఎస్​ఏ- న్యూయార్క్
  • 15th జూన్ vs కెనడ- న్యూయార్క్
    • Get ready for the ultimate cricket carnival in the West Indies and the USA 🥁

      Unveiling the fixtures for the ICC Men’s T20 World Cup 2024 🗓️ 🤩#T20WorldCup | Details 👇

      — ICC (@ICC) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
గ్రూప్ A గ్రూప్ Bగ్రూప్ Cగ్రూప్ D
భారత్ఇంగ్లాండ్న్యూజిలాండ్సౌతాఫ్రికా
పాకిస్థాన్ఆస్ట్రేలియావెస్టిండీస్శ్రీలంక
ఐర్లాండ్నమీబియాఅఫ్గానిస్థాన్బంగ్లాదేశ్
కెనడస్కాట్లాండ్ఉగాండనెదర్లాండ్స్
యూఎస్​ఏఒమన్పపువా న్యూ గునియానేపాల్

కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్​ షెడ్యూల్ రావడం వల్ల ఆయా జట్లు ఇక టోర్నీకి సిద్ధం కానున్నాయి. అయితే టీమ్ఇండియాలో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2022 వరల్డ్​కప్​ తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్​లో ఆడలేదు. అయితే తాజాగా వీరిద్దరూ టీ20ల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐకి తెలిపారట. ఇదివరకూ కూడా 2024 టీ20 వరల్డ్​కప్ కెప్టెన్ ఎంపికకు రోహిత్ శర్మే ఫస్ట్ ఛాయిస్​ అని అప్పట్లో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో!

Afghanistan Tour Of India 2024: అఫ్గానిస్థాన్ ఈ నెల భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకోలేదు. మరి జట్టు సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్​కు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.

'టీ20లు ఆడేందుకు మేము రెడీ'- బీసీసీఐతో రోహిత్, విరాట్

పొట్టి వరల్డ్ కప్​- భారత్‌ X పాక్‌ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

Last Updated : Jan 5, 2024, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.