ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్​ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్​- కెప్టెన్​ ఛాన్స్ అతడికే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 1:01 PM IST

Updated : Jan 6, 2024, 1:15 PM IST

Rohit Sharma T20 World Cup
Rohit Sharma T20 World Cup

Rohit Sharma T20 World Cup : జూన్​లో జరగనున్న టీ20 వరల్డ్​కప్​లో భారత జట్టుకు కెప్టెన్​గా రోహిత్ శర్మను తీసుకోనున్నారని తెలుస్తోంది. విరాట్​ కోహ్లీని ఈ మెగా టోర్నీకి దూరం పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వరల్డ్​కప్​ స్క్వాడ్​లో వీరిద్దరు ఉంటారా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మిరిన్ని వివరాలు మీకోసం.

Rohit Sharma T20 World Cup : మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో అఫ్గానిస్థాన్​తో తలపడనుంది టీమ్ఇండియా. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దీని​ కోసం జట్టు ఎంపిక చేసేందుకు బీసీసీఐ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు ఎలా ఉండనుందో అని క్రికెట్​ లవర్స్​లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సిరీస్​లో ఎంపికను బట్టే జూన్​లో జరగనున్న టీ20 వరల్డ్​కప్ తుది జట్టును ఎంపిక చేస్తారు. దీంతో ప్లేయర్ల అవకాశాలపై పలు ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.

మరోవైపు అఫ్గానిస్థాన్​ టీ20 సిరీస్​ జట్టు ఎంపికకు తాము కూడా అందుబాటులో ఉంటామంటూ విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ తాజాగా బీసీసీఐకి సమాచారం అందించారు. దీన్ని బట్టి వీరిద్దరూ టీ20 వరల్డ్​ కప్​ ఆడేందుకు సముఖంగానే ఉన్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ జట్టులో వీరి అవకాశాలపై కూడా క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. ఇదే అంశంపై తాజాగా ఓ వార్త వైరల్​ అవుతోంది. టీ20 వరల్డ్​కప్​ జట్టుకు కెప్టెన్​గా రోహిత్​ శర్మనే బీసీసీఐ నియమించి, విరాట్​ కోహ్లీని పక్కకు పెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కీపర్​గా కేఎల్ రాహుల్​ జట్టులోకి తీసుకుని మిడిలార్డర్​లో బ్యాటింగ్​ ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. ఇక స్టార్ టీ20 ప్లేయర్​ సూర్యకుమార్ యాదవ్​ను వన్​డౌన్​ పొజిషన్​కు తీసుకోవాలని క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు టాక్.

ఒక వేళ ఈ ప్రచారం నిజమైతే టీ20 వరల్డ్​ కప్​లో ఓపెనర్​గా రోహిత్​తో పాటు యంగ్​ ప్లేయర్​ యశస్వి జైశ్వాల్​ లేదా శుభ్​మన్​ గిల్​ క్రీజులోకి దిగుతారు. ఇక వన్​డౌన్​లో సూర్య కూమార్ బ్యాటింగ్ చేస్తాడు. శ్రేయస్ అయ్యర్​ లేదా తిలక్​ వర్మ నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇక కేఎల్​ రాహుల్​ను వికెట్ కీపర్​గా తీసుకుంటే అతడు 5 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆరో స్థానంలో రింకూ సింగ్, ఆల్​రౌండర్​గా జడేజాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా, సిరాజ్, రవిబిష్ణోయ్, ప్రసిద్ధ్​ కృష్ణను బౌలర్లుగా తీసుకునే ఛాన్స్ ఉంది.

T20 World Cup Squad : టీ20 వరల్డ్​కప్ భారత జట్టు (అంచనా) :
రోహిత్, యశస్వి ​/ గిల్, శ్రేయస్​ / తిలక్​ వర్మ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ / ఇషాన్, రింకూ సింగ్, జడేజా / వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, రవిబిష్ణోయ్ / కుల్దీప్, ప్రసిధ్

Last Updated :Jan 6, 2024, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.