ETV Bharat / entertainment

అప్పుడు అవమానం జరిగింది.. చాలా బాధ పడ్డా: చిరు

author img

By

Published : Apr 25, 2022, 9:50 PM IST

1988 దిల్లీ పర్యటనలో జరిగిన ఆ సందర్భాన్ని ఎంతో అవమానకరంగా భావించానని మెగాస్టార్​ చిరంజీవి తెలిపారు. ఆ రోజు చాలా బాధపడ్డానని చెప్తూ ఆచార్య ప్రీరిలీజ్​ ఈవెంట్​లో చిరు భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఆ రోజు దిల్లీలో ఏం జరిగిందంటే?
chiranjeevi
chiranjeevi

చిరంజీవి భావోద్వేగకర స్పీచ్​

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్​చరణ్​ హీరోలుగా నటించిన చిత్రం 'ఆచార్య'. భారీ అంచనాల నడుమ ఏప్రిల్​ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ- మెగాస్టార్​ చిరంజీవి కాంబోలో తొలి సినిమా కావడం వల్ల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్​లో భాగంగా శనివారం హైదరాబాద్​లో ప్రీరిలీజ్​ వేడుక ఘనంగా నిర్వహించింది చిత్రబృందం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు​ రాజమౌళి హాజరయ్యారు. ఇక, ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి.. 1988లో దిల్లీ పర్యటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

"1988లో నాగబాబు నిర్మించిన 'రుద్రవీణ' చిత్రానికి నేషనల్​ ఇంటిగ్రిటీ అవార్డు వరించింది. ఆ అవార్డును అందుకోవడానికి దిల్లీ వెళ్లాము. ఆ రోజు సాయంత్రం అవార్డు ఫంక్షన్​కు కాసేపటి ముందు జరిగిన తేనేటి విందుకు హాజరయ్యాము. ఆ సమయంలో చుట్టూ గోడలపై భారతీయ సినిమా వైభవం ఉట్టిపడేలా పోస్టర్లు ప్రదర్శించారు. వాటి కింద ఆ పోస్టర్లకు సంబంధించిన విషయాల్ని పూర్తిగా వివరించారు. పృధ్వీరాజ్​ కపూర్​ నుంచి రాజ్​కపూర్​, దిలీప్​కుమార్​, దేవానంద్, రాజేశ్​ ఖన్నా, అమితాబ్​ బచ్చన్​ల గురించి అద్భుతంగా ప్రదర్శించారు. అలా చూస్తూ వెళ్తే దక్షిణాది చిత్రాల గురించి ఎక్కడా కనిపించలేదు. చివరలో ఎంజీఆర్​-జయలలిత డ్యాన్స్​ స్టిల్​, ప్రేమ్​ నజిర్​ ఫొటో తప్ప నాకు ఇంకేం కనిపించలేదు. కన్నడ కంఠీరవ రాజ్​కుమార్​, ఎన్టీఆర్​, ఏఎన్నార్​లకు సంబంధించి ఒక్క ఫొటో కూడా​ లేదు."

- మెగాస్టార్​ చిరంజీవి

కేవలం ఇండియన్​ సినిమాలు అంటే ఒక్క హిందీ సినిమాలే అన్నట్టుగా ఆ రోజు అవార్డు ఫంక్షన్​ నిర్వాహకులు వ్యవహరించారని చిరంజీవి అన్నారు. "మిగతా ప్రాంతీయ భాషలను పూర్తిగా పట్టించుకోలేదు. ఆరోజు చాలా బాధపడ్డాను. ఎంతో అవమానకరంగా భావించాను. ఆ తర్వాత ప్రెస్​మీట్​లో జరిగినదంతా వివరించాను. హిందూ పేప‌ర్‌లో నేను మాట్లాడిన మాటల గురించి బాగా రాసినా, ఇప్ప‌టి వ‌ర‌కు వాటికి స‌మాధాన‌మే లేదు. అయితే నేను గ‌ర్వ‌ప‌డేలాగా, రొమ్ము విరుచుకునేలాగా తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాద‌ని, హ‌ద్దులు చెరిపేసి మాదంతా ఒక‌టే భార‌త‌దేశం.. మా సినిమాల‌న్నీ కూడా ఇండియ‌న్ సినిమాలే అని ప్ర‌తీ ఒక్క‌రూ గ‌ర్వ‌ప‌డేలాగా 'బాహుబ‌లి', 'బాహుబ‌లి 2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు దోహ‌ద‌ప‌డ్డాయి" అని చిరంజీవి చెప్పారు.

ఇవీ చదవండి: మహేశ్ ​బాబును ఇంటికి రావొద్దన్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

చరణ్​ తొలి సినిమాకు.. ఇప్పటికి తేడా అదే: చిరు

దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.