ETV Bharat / entertainment

దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..

author img

By

Published : Apr 24, 2022, 5:04 PM IST

Acharya Dharmastali Set: మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న'ఆచార్య' సినిమా రిలీజ్​కు సిద్ధమవుతోంది. సినిమాలో 'ధర్మస్థలి' అనే టెంపుల్ టౌన్​ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు విశేష ప్రాధాన్యం ఉంది. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన 'ధర్మస్థలి' సెట్​ విశేషాలు మీకోసం...

acharya set
acharya set

Acharya Dharmastali Set: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆచార్య'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఈ టీమ్‌ మొత్తం ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్​కు ముందే భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతవరకు ఎన్నడూ ఏ చిత్రానికి చేయని విధంగా సుమారు 20 ఎకరాల్లో 'ఆచార్య' కోసం 'ధర్మస్థలి' అనే సెట్​ను తీర్చిదిద్దారు. ఒకే చోట ఇంత పెద్ద సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవికి చెందిన 20 ఎకరాల స్థలంలో నాలుగు నెలలపాటు శ్రమించి 'ధర్మస్థలి' సెట్​ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ పర్యవేక్షణలో రోజుకు వందలాది మంది పనిచేసి నిర్మించారు. దక్షిణాదిలోని ప్రఖ్యాత దేవాలయాలను తలపించేలా సురేష్ ధర్మస్థలిని తీర్చిదిద్దారు. పూర్తిగా పర్యావరణ హితంగా, చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన సెట్ లో దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే మారేడుమిల్లిలో గ్రామీణ ప్రాంతాన్ని తలదన్నేలా పాదఘట్టం అనే మరోసెట్ వేసి చిరంజీవి, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు.

ధర్మస్థలి ఎక్కుడుందని అంతా వెతుకుతారు.. 'ఆచార్య' సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ 'ధర్మస్థలి' ఎక్కడ ఉంది? అని వెతకడం ప్రారంభిస్తారని దర్శకుడు కొరటాల శివ అన్నారు. 'ఆచార్య' ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలో కీలకంగా చెప్పుకునే 'ధర్మస్థలి' ఎపిసోడ్‌పై ఆయన స్పందించారు. 'ధర్మస్థలి'ని ఎలా సృష్టించారో చెప్పారు. "పురాతన గాథలు, ఎన్నో నమ్మకాలు కలిగిన అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతమది. దాని పేరు 'ధర్మస్థలి'. కథ ఎక్కువగా ధర్మం అనే కాన్సెప్ట్‌ చుట్టే ఉంటుంది. కాబట్టి.. ఆ టెంపుల్‌ టౌన్‌కి 'ధర్మస్థలి' అనే పేరు పెడితే బాగుంటుందని భావించాం. మా అందరికీ ఆ పేరు బాగా నచ్చింది. 'ధర్మస్థలి' ఎపిసోడ్‌ షూట్‌కి మాకొక అందమైన టెంపుల్‌ టౌన్‌ కావాలి. అందుకోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు మాకు నచ్చాయి. షూటింగ్‌ సాధ్యం కాదేమో అనిపించింది." అని కొరటాల శివ తెలిపారు.

"అలా, చివరికి మేము 'ధర్మస్థలి' సృష్టించాలని నిర్ణయించుకున్నాం. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. దాంతో మా ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ఎన్నో ప్రాంతాలకు వెళ్లి.. పరిశోధన చేశారు. సెట్‌ని నిర్మించే సమయంలో మేమూ పూజలు చేశాం. దేవాలయాల పవిత్రత ఎక్కడ దెబ్బతినకుండా తీర్చిదిద్దాం. సినిమా చూసినప్పుడు 'ధర్మస్థలి' ఎక్కడుంది? అక్కడికి వెళ్దామనే ఆలోచన ప్రతి ఒక్కరికీ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అదొక అందమైన ప్రదేశం. 20 ఎకరాల్లో కోట్లు వెచ్చించి నిర్మించిన బిగ్గెస్ట్‌ సెట్‌ ఇది"

- కొరటాల శివ

ఇవీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్​ బ్యూటీ?

చిరు, ఉపాసన.. వీరిద్దరిలో చరణ్‌ ఎవరికి భయపడతారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.