ETV Bharat / entertainment

చరణ్​ తొలి సినిమాకు.. ఇప్పటికి తేడా అదే: చిరు

author img

By

Published : Apr 25, 2022, 4:18 PM IST

Chiranjeevi Ramcharan: మెగా హీరోలు చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్​ 29న విడుదల కానున్న ఈ సినీ ప్రమోషన్స్​లో భాగంగా..​ మెగాస్టార్​ చిరంజీవి​, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చిరంజీవి.. 'చిరుత' నుంచి 'సిద్ధ' వరకు చరణ్​లో గమనించిన తేడాను అభిమానులకు వివరించారు.

CHIRU CHARAN
CHIRU CHARANCHIRU CHARAN

చిరు ఇంటర్వ్యూ

Acharya Promotions: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న 'ఆచార్య'.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న ప్రేక్షకుల మందుకు రానుంది. కొరటాల- మెగాస్టార్‌ కాంబినేషన్ కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్‌ అదిరిపోయినందున.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరంజీవితో పాటు ఆయన తనయుడు​ రామ్​చరణ్​ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల మెగా అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా మెగాస్టార్​ చిరంజీవి, డైరెక్టర్‌ కొరటాల శివ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'చిరుత' నుంచి 'ఆచార్య' వరకు చరణ్​లో గమనించిన తేడా ఏంటి అని యాంకర్​ అడిగిన ప్రశ్నకు చిరు సమాధానమిచ్చారు.

"మొదటి నుంచి నాకెప్పుడు చరణ్​ ఏ విషయంలో తప్పు చేస్తున్నాడని అనిపించలేదు. బహుశా నా కన్న బిడ్డ కనుక అతడిపై ఉన్న ప్రేమ కవర్​ చేస్తుందేమో. అయితే బయట వాళ్లు ఏం అనుకుంటున్నారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ అందరూ చరణ్​ బాగా నటిస్తున్నాడని చెప్పేవారు. ఏ హీరో అయినా మొదటి చిత్రం నుంచే అద్భుతంగా నటిస్తే.. అతడి ఒకటి రెండు సినిమాలు అయ్యాక ఓవర్​ అనిపిస్తుంది. ఇక, మొదటి చిత్రం నుంచి చరణ్​ అన్ని విషయాల్లో అంచెలంచెలుగా డెవలప్​ అయ్యాడు." -మెగాస్టార్​ చిరంజీవి

సినీ రంగంలో కావలసిన మెలకువలను చరణ్​ బాగా నేర్చుకున్నాడని చిరంజీవి అన్నారు. "హెల్దీ డెవలప్​మెంట్​ అంటే అది.. అలాంటి వృద్ధిని అభిమానులు ఆస్వాదిస్తారు, ఆమోదిస్తారు. ఇప్పుడు అభిమానులే చూస్తున్నారు కదా.. మొదటి సినిమాకి ఇప్పుడుకి చరణ్​లో ఎంత తేడా వచ్చిందో." అని చిరు చెప్పుకొచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్​ సరసన పూజా హెగ్డే నటించారు. రెజీనా ఓ ప్రత్యేకంగా గీతంలో సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: దేశంలో అతిపెద్ద సినిమా సెట్.. 'ధర్మస్థలి'ని తీర్చిదిద్దారిలా..

అలాంటి కథల్ని చేయడానికే నేను ఇష్టపడతా: చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.