ETV Bharat / snippets

'మంజుమ్మెల్ బాయ్స్' మేకర్స్​కు ఇళయరాజా నోటీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 7:49 AM IST

Ilayaraja Manjummel Boys
Ilayaraja Manjummel Boys (Ilaiyaraaja (Left), Manjummel Boys Film Poster (Right) (Image source: ANI))

Ilayaraja Manjummel Boys: మలయాళం రీసెంట్ హిట్ 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ మేకర్స్​కు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా షాకిచ్చారు. సినిమాలో ఓ సన్నీవేశంలో అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడినందుకు మూవీ ప్రొడ్యూసర్లకు ఇళయరాజా తాజాగా లీగల్ నోటీసులు పంపారు. 1991లో కమల్​హాసన్ హీరోగా తెరకెక్కిన 'గుణ' సినిమాలోని తన మ్యూజిక్​ను ఈ మూవీలో వాడారు అని ఇళయరాజా అన్నారు. కాగా, తన సంగీతంలోని పాటలను ఆయన అనుమతిలేకుండా స్టేజ్‌ షోలలో పాడకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో రీసెంట్​గా రజనీకాంత్ 'కూలి'ని నిర్మిస్తున్న సన్​పిక్చర్స్​కు కూడా నోటీసులు పంపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.