ETV Bharat / business

బ్యాంక్​ ఆఫ్​ బరోడా గుడ్​న్యూస్- కుటుంబం మొత్తానికి ఒకే అకౌంట్​! కళ్లు చెదిరే బెనిఫిట్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 3:31 PM IST

Bank Of Baroda Parivar Account: ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం, బిజినెస్​ అని కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. దీంతో మినిమమ్ బ్యాలెన్స్, ఛార్జీలు, నిర్వహణ వంటి పలు అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటన్నింటికి పరిష్కారం చూపేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం..

Bank Of Baroda Parivar Account Full Details
Bank Of Baroda Parivar Account Full Details

Bank Of Baroda Parivar Account Full Details: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉన్నా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తాజాగా తన కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ అందించింది. కొత్త బ్యాంక్ అకౌంట్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఖాతా వల్ల కస్టమర్లు పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ ఆ అకౌంట్ ఏంటి? దాని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వంటి అంశాలను ఈ స్టోరీలో ఒకసారి చూద్దాం..

Bank Of Baroda New Services in Telugu: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త రకం సేవింగ్స్, కరెంట్ అకౌంట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఓబీ పరివార్ అకౌంట్ పేరుతో ఈ నూతన సేవలు ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా.. బీఓబీ కే సంగ్ త్యోహార్ కి ఉమాంగ్ ఫెస్టివల్ క్యాంపెయిన్‌లో భాగంగా "ద మై ఫ్యామిలీ మై బ్యాంక్ సెగ్మెంట్" సేవలు తీసుకొచ్చింది. దీని ద్వారా కుటుంబంలోని సభ్యులందరి ఖాతాలను ఒక దగ్గరికి తీసుకొచ్చి పలు బెనిఫిట్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్​ తెలిపింది. ఎవరి ఖాతాను వారు నిర్వహించుకుంటారు. కానీ, ఖాతాల్లో మినిమం అనేది గ్రూప్ లేదా కుటుంబం పరంగా లెక్కించనుంది. దీంతో ఒక్కో ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్-రూ. 10వేలపై ఐదేళ్లలో బ్యాంకుల కంటే ఎక్కువ లాభం!

అర్హతలు ఇవే..

  • బ్యాంక్ ఆఫ్ బరోడా పరివార్ అకౌంట్ తీసుకోవాలంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా గరిష్ఠంగా 6 మంది తీసుకోవచ్చు.
  • అందులో జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, అత్తామామలు, మరదళ్లు, బావమర్దులు వంటి వారిని చేర్చుకోవచ్చు.
  • అలాగే బీఓబీ పరివార్ కరెంట్ అకౌంట్ సెగ్మెంట్‌లో ప్రొప్రెయిటర్ షిప్, పార్ట్నర్ షిప్, ఎల్ఎల్‌పీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వంటి వాటికి అర్హత ఉంటుంది. అవన్ని ఒక గ్రూప్ కంపెనీ లేదా సిస్టర్ కంపెనీగా ఉండాలి.
  • ఇందులో మూడు రకాల అకౌంట్స్ ఉంటాయి. డైమండ్, గోల్డ్, సిల్వర్ ఖాతాలు ఉంటాయి. ఆయా ఖాతాలను బట్టి మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుంది.
  • సేవింగ్స్ అకౌంట్.. డైమండ్ ఖాతాకు రూ.5 లక్షలు, గోల్డ్ ఖాతాకు రూ.2 లక్షలు, సిల్వర్ ఖాతాకు రూ.50 వేలు ఆపైన ఉండాలి.
  • కరెంట్ అకౌంట్ డైమండ్ ఖాతాకు రూ.10 లక్షలు, గోల్డ్ ఖాతాకు రూ.5 లక్షలు, సిల్వర్ ఖాతాకు రూ.2 లక్షలు ఉండాలి.

ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్​ బండిలా ఉంటుంది!

9 బెనిఫిట్స్ ఇవే..

Benefits of BOB Parivar Account:

  • సేవింగ్స్ ఖాతాదారులకు రిటైల్ లోన్స్ పై వడ్డీలో రాయితీ
  • రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీల మాఫీ
  • లాకర్ రెంట్ ఛార్జీల్లో రాయితీ
  • డీమ్యాట్ ఏఎంసీ పై రాయితీ
  • మాన్యువల్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలపై రాయితీ
  • డీడీ లేదా పీఓ ఛార్జీలు పూర్తిగా మాఫీ
  • చెక్ బుక్ ఛార్జీల్లో రాయితీ
  • ఇతర బ్యాంకుల చెక్‌లు డ్రా చేసే టప్పుడు వేసే ఛార్జీలు సైతం మాఫీ
  • కాంప్లిమెంటరీ SMS/ఇమెయిల్ హెచ్చరికలు స్టాండింగ్ సూచనలు

గమనిక: ఈ సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలకు మీ దగ్గరలోని బ్యాంక్​ ఆఫ్​ బరోడా ఆఫీసును సందర్శించగలరు.

రిలయన్స్ జియో సూపర్​ ఆఫర్​ - ఉచిత ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ సహా అన్​లిమిటెడ్ 5G ఇంటర్​నెట్!

మ్యూచువల్ ఫండ్స్​లో పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? - అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.