ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్స్​లో పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? - అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 10:31 AM IST

How to Invest in Mutual Fund for Minors : మీ పిల్లల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వారి పేరు మీద మ్యూచువల్ ఫండ్స్​లో పొదుపు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కాగా, చాలా మందికి మైనర్ల పేరు మీద ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఒకవేళ తెలిసినా.. మధ్యలో కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. మరి దానికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..

Mutual Fund
Mutual Fund

How to Invest in Mutual Fund in The Name of Child : ప్రస్తుత కాలంలో ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ భవిష్యత్తు గురించి ముందే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పేరెంట్స్ తమవద్ద మిగులు ఉంటే ఆ మొత్తాన్ని పెట్టుబడుల కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. కేవలం పిల్లల ఉన్నత చదువులకే కాకుండా సంపదను పెంచే విధంగానూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది తమ సొమ్మును ఇన్వెస్ట్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds)​కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే కొందరు తమ పిల్లల పేరు మీద కూడా మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ, మైనర్ చిన్నారుల మీద ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలియక వెనక్కి తగ్గుతుంటారు. అలాంటి వారి కోసం మైనర్ పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్​లో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఏయే పత్రాలు అవసరం? ప్రయోజనాలేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండిలా..

మీ పిల్లల పేరు మీద మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలనకుంటే.. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) అనే మ్యూచువల్ ఫండ్ హౌస్ ద్వారా నేరుగా మీ చిన్నారుల పేరు మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా మీరు మీ పిల్లల పేరుతో ఆఫ్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ పేరు మీద ఆన్​లైన్​లో కూడా పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయవచ్చు. అయితే మైనర్‌ల కోసం ఆన్‌లైన్ పెట్టుబడులను అనుమతించే ప్లాట్‌ఫారమ్‌లు చాలా తక్కువ. కాబట్టి ఆఫ్‌లైన్ మోడ్ ద్వారానే పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అవసరమైన పత్రాలు : మీ పిల్లల జనన ధృవీకరణ పత్రం, గార్డియన్ వివరాలు తెలిపే పత్రం, అడ్రస్​ ప్రూఫ్​తో సహా మరికొన్ని కావాల్సిన పత్రాలు.

KYC సమ్మతి : మైనర్​కు సంబంధించిన గార్డియన్.. మీ కస్టమర్ గురించి తెలుసుకోండి (కేవైసీ ) నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఫారమ్ నింపడం : మీ పిల్లల పేరు మీద పెట్టుబడి కోసం AMC అందించిన అవసరమైన ఫారమ్‌లను పూరించాలి.

మ్యూచువల్ ఫండ్ ఎంపిక : మీ పిల్లల రిస్క్ టాలరెన్స్, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవాలి. పెట్టుబడి హోరిజోన్, రిస్క్ ప్రొఫైల్, ఫండ్ పనితీరు వంటి అంశాలను పరిగణించాలి.

పెట్టుబడి ప్రారంభం : ఆ తర్వాత కావలసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను ఎంచుకుని.. పెట్టుబడి మొత్తం, ఫ్రీక్వెన్సీని పేర్కొనాలి. ఆపై అందులో పెట్టుబడి ప్రక్రియను ప్రారంభించాలి.

పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై పన్ను వివరాలిలా..

పన్ను బాధ్యత(Tax liability) : పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో వారి పేరు మీద తల్లిదండ్రులు పెట్టుబడి పెడుతున్నట్లయితే.. మ్యూచువల్ ఫండ్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంతో కలుపుతారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం.. ఎక్కువ సంపాదిస్తున్న తల్లిదండ్రులిద్దరిలో ఎవరు మొదట్లో డబ్బు అందించారనే దానితో సంబంధం లేకుండా ఇది ఉంటుంది.

మైనర్ స్థితి(Minor's status) : పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత వారు పెట్టుబడికి ఏకైక యజమాని అవుతారు. అప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం, మూలధన లాభాలపై పన్నులు చెల్లించే బాధ్యతను కలిగి ఉంటారు.

Mutual Funds Investment Guide For Beginners : మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలా?.. ఈ 5 సూత్రాలు కచ్చితంగా పాటించండి!

పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు..

రిడెంప్షన్(Redemption) : SEBI సర్క్యులర్ నంబర్ ప్రకారం.. మైనర్ పేరుతో చేసిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి అన్ని రిడెంప్షన్స్ మైనర్ ధృవీకరించిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమ అవుతాయి.

ఆర్థిక లక్ష్యాలు(Financial Goals) : పెట్టుబడి హోరిజోన్, రిస్క్ టాలరెన్స్‌ని నిర్ణయించడానికి మీ పిల్లల ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా పేర్కొనాలి.

డైవర్సిఫికేషన్(Diversification) : రిస్క్‌ని తగ్గించడానికి, రాబడిని పెంచడానికి వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాలను తనిఖీ చేయాలి.

రెగ్యులర్ మానిటరింగ్(Regular monitoring) : ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్స్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. అవసరమైన విధంగా సర్దుబాట్లు చేసుకోవాలి.

పిల్లల ప్రమేయం(Child's involvement) : ఆర్థిక అవగాహన, బాధ్యతను పెంపొందించడానికి మీ పిల్లల వయస్సుకు తగిన ఆర్థిక చర్చలలో పాల్గొనాలి.

వృత్తిపరమైన మార్గదర్శకత్వం చేయాలి(Seek professional Guidance): మీ పిల్లల నిర్దిష్ట ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సలహా కోసం ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి.

What Is Freedom SIP : మీ పెట్టుబడి 12 రెట్లు పెరగాలా?.. ఫ్రీడమ్​ సిప్ ట్రై చేయండి!

SIP Plan : రోజూ రూ.100 చొప్పున ఆదా చేస్తే.. ఆ సమయానికి కోటీశ్వరులు కావచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.