ETV Bharat / business

పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్-రూ. 10వేలపై ఐదేళ్లలో బ్యాంకుల కంటే ఎక్కువ లాభం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 11:11 AM IST

RD Interest Rates Post Office Vs Banks : నెలనెల తక్కువ మొత్తంలో డబ్బును జమ​ చేస్తూ.. ఎక్కువ సొమ్మును కూడగట్టుకునేందుకు రికరింగ్​ డిపాజిట్లు తోడ్పడతాయి. అయితే ఆర్​డీలపై ఒక్కో బ్యాంక్​ ఒక్కో విధంగా వడ్డీలు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోస్టాఫీస్, వివిధ బ్యాంకులు​.. చెల్లించే వడ్డీరేట్లపై ఓ లుక్కేద్దాం.

Postoffice Scheme
Postoffice Scheme

Recurring Deposit Interest Rates 2023 : ప్రస్తుత రోజుల్లో ఎంత సంపాందించినా.. చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు. రోజురోజుకీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతోపాటు పలు రకాల కారణాలతో జనం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి.. ఎవరైనా సరే, సంపాదన ప్రారంభించిన వెంటనే పొదుపు చేసుకోవడం మొదలు పెట్టాలి. దీని కోసం ఇప్పుడు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి రికరింగ్​ డిపాజిట్​. నిర్దిష్ట కాలానికి నెలవారీగా కొంత మొత్తం మనీ కట్టుకుంటూ పోతే.. మంచి వడ్డీ రేటుతో అదిరిపోయే రిటర్న్స్ ఇందులో లభిస్తోంది. ఎవరైనా ఈ డిపాజిట్ స్కీమ్ కింద నిర్దిష్ట కాలానికి ప్రతి నెలా/త్రైమాసికం/అర్ధ సంవత్సరం నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్‌ చేయొచ్చు. పైగా రిస్క్ కూడా తక్కువ.

Post Office Vs Banks RD Interest Rates : అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, స్వల్ప కాలానికి చిన్న మొత్తంతో ఇన్వెస్ట్​మెంట్ పెట్టాలనుకునే వారికి ఆర్​​డీలు మంచి ఎంపిక. అదే పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం, పెళ్లికి ప్లాన్‌ చేయడం లేదా అత్యవసర నిధి ఏర్పాటు వంటి వివిధ లక్ష్యాలను సాధించడానికి దీర్ఘకాలిక ఆర్‌డీలు(RD) అనువైనవి. అయితే చాలా మంది రికరింగ్ డిపాజిట్ అంటే బ్యాంకులకు వెళ్తుంటారు. ఎల్లవేళలా అది మంచి ఆప్షన్ కాదని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. జనాల్లో విశేష ఆదరణ పొందిన పోస్టాఫీస్​లోను రికరింగ్ డిపాజిట్(RD) ఉంది. ఇందులో అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌ వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర పెంచగా ఇది 6.50 శాతం నుంచి 6.70 శాతానికి పెరిగింది.

Recurring Deposit Scheme : ఇక బ్యాంకుల విషయానికొస్తే.. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ అనేది 6 నెలల నుంచి ఐదేళ్ల టెన్యూర్‌తో ఉంది. అంటే మీరు ఎంత కాలానికైనా అందులో డిపాజిట్లు చేయొచ్చు. ఇక్కడ రికరింగ్ డిపాజిట్ అంటే నెలనెలా డిపాజిట్ చేయాల్సి ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇక అదే పోస్టాఫీస్ స్కీమ్స్(Post Office scheme)​లో మాత్రం ఐదేళ్ల టెన్యూర్‌ ఒక్కటే ఉంది. అంటే నెలనెలా 5 సంవత్సరాలు కట్టాలి అన్నమాట. అయితే.. ఇప్పుడు చాలా మందికి ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందనే అనే సందేహం వస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్​ని.. ఐదేళ్ల బ్యాంక్ ఆర్​డీల వడ్డీ రేట్లనుతో పోలిస్తే ఏది బెటర్ అనేది తెలుస్తుంది. మరి, దేంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

SBI RD Vs Post Office RD.. రెండింట్లో ఏది బెటర్​ ఆప్షన్​?

Post Office Scheme : ప్రస్తుతం పోస్టాఫీస్​లో ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్​(RD)పై వడ్డీ రేట్లు 6.70 శాతంగా ఉండగా.. అదే దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 5 సంవత్సరాల ఆర్‌డీపై 6.50 శాతం వడ్డీ వస్తుండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మాత్రం 5.30 శాతంగా ఉంది. అలాగే ఐదేళ్ల ఆర్​డీలపై యస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకుల్లో 6.50 శాతం వడ్డీ ఉండగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంధన్ బ్యాంకుల్లో 5.60 శాతంగా ఉంది.

ఇక అత్యల్పంగా సిటీబ్యాంకులో 3 శాతం మాత్రమే వడ్డీ వస్తోంది. ఇక ప్రైవేట్​ బ్యాంకులైన యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో 5 ఏళ్ల టెన్యూర్ ఉన్న ఆర్​డీలపై 7 శాతం వడ్డీ వస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంకులో మాత్రం 6.90 శాతం వడ్డీ అమల్లో ఉంది. ఇక కెనరా బ్యాంకులో 6.80 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.75 శాతంగా ఉంది.

పోస్టాఫీసులో ఆర్​డీపై ఐదేళ్లలో ఎంతొస్తుందంటే.. ప్రస్తుతం ఉన్న పోస్టాఫీస్ RD వడ్డీ రేటు 6.70 శాతం ప్రకారం చూసుకుంటే.. మీరు ఉదాహరణకు నెలకు రూ. 10 వేల చొప్పున డిపాజిట్ చేస్తే.. ఐదేళ్లలో మీ పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. అలాగే దానిపై రూ. 1,13,658.29 వడ్డీ వస్తుంది. అంటే అప్పుడు మొత్తం మీ చేతికి రూ.7,13,658.29 వస్తుందన్నమాట.

Post Office Vs SBI Vs HDFC Interest Rates : పోస్టాఫీస్/ఎస్​బీఐ/హెచ్​డీఎఫ్​సీ.. రికరింగ్ డిపాజిట్​కు ఏది బెటర్..?

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?

Post Office Saving Scheme : పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్​.. ఎలాంటి రిస్కు లేకుండా డబ్బులు డబుల్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.