ETV Bharat / business

సోనీ ఇండియాతో జీ ఎంటర్​టైన్మెంట్ విలీన ఒప్పందం

author img

By

Published : Sep 22, 2021, 10:56 AM IST

Updated : Sep 22, 2021, 12:03 PM IST

Zee Entertainment, Sony merger
జీ గ్రూప్​తో సోనీ ఒప్పందం

ప్రముఖ​ మీడియా కంపెనీ జీ ఎంటర్​టైర్మెంట్(Zee Entertainment)​, సోనీ పిక్చర్స్​తో (Sony India) విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పూర్తయ్యేందుకు 90 రోజుల సమయం పట్టనుంది.

దేశీయ ఎంటర్​టైన్మెంట్​ మీడియా వ్యాపారంలో భారీ ఒప్పందం జరిగింది. జీ ఎంటర్​టైన్మెంట్​ లిమిటెడ్​, సోనీ పిక్చర్స్​తో విలీన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు జీ ఎటర్​టైన్మెంట్.. బోర్డు ప్రాథమికంగా ఆమోద ముద్ర వేసింది.

ఈ ఒప్పందంతో ఇరు కంపెనీలు లీనియర్​ నెట్​వర్క్​లు, డిజిటల్ ఆస్తులు, నిర్మాణ వ్యవహారాల వంటివి ఒక చోటుకు చేరనున్నాయి. ఇందులో సోనీ పిక్చర్స్​ 1.57 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థలో సోని పిక్చర్స్​కు 52.93 శాతం వాటా, జీ ఎంటర్​టైర్మెంట్​ చేతికి 47.07 శాతం వాటా దక్కనున్నట్లు తెలుస్తోంది.

జీ ఎంటర్​టైన్మెంట్​ ఎండీ, సీఈఓ పునీత్​ గోయెంకానే కొత్తగా ఏర్పడిన సంస్థలో కూడా అదే బాధ్యతల్లో కొనసాగున్నారు. విలీనం తర్వాత లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుందని స్పష్టం చేసింది జీ ఎంటర్​టైర్మెంట్​.

Punit Goenka
పునీత్ గోయెంక

ఈ డీల్ వార్తలతో జీ ఎంటర్​టైన్మెంట్ ఎంటర్​ప్రైజెస్​ షేర్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. బీఎస్​ఈలో సంస్థ షేరు 21 శాతానికిపైగా పెరిగి.. రూ.310 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి: Wipro: విలువలే శ్వాసగా.. విప్రో 75 ఏళ్ల ప్రయాణం

Last Updated :Sep 22, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.