ETV Bharat / bharat

పుతిన్​కు మోదీ ఫోన్- అఫ్గాన్​పై 45 నిమిషాలు చర్చ!

author img

By

Published : Aug 24, 2021, 3:31 PM IST

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్​లో తలెత్తిన సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలు జరిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్​లో మాట్లాడుకున్నారు.

putin modi phone call
పుతిన్ మోదీ ఫోన్ సంభాషణ

అఫ్గానిస్థాన్​లో పరిణామాలు వేగంగా మారిపోయి, తాలిబన్ల శకం ఆరంభమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక చర్చ(PM Modi Putin phone call) జరిగింది. ఇరువురు దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్​లో మాట్లాడుకున్నారు.

అఫ్గాన్ అంశంపై పుతిన్​(Russian President Vladimir Putin)తో కలిసి వివరంగా చర్చించినట్లు మోదీ తెలిపారు. కరోనాపై పోరులో సహకారం సహా ద్వైపాక్షిక అంశాలపైనా మాట్లాడుకున్నట్లు మోదీ(PM Modi) చెప్పారు.

"అఫ్గానిస్థాన్​లో పరిణామాలపై నా మిత్రుడు పుతిన్​తో అభిప్రాయాలు పంచుకున్నా. ద్వైపాక్షిక అజెండా, కొవిడ్​పై భారత్- రష్యా మధ్య భాగస్వామ్యం గురించి చర్చించాం. ముఖ్యమైన విషయాలపై ఇరువురూ సంప్రదింపులు జరుపుకోవాలని అంగీకరించుకున్నాం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సోమవారం జర్మనీ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్​(German Chancellor Angela Merkel)తోనూ చర్చలు జరిపారు మోదీ. అఫ్గాన్ సంక్షోభం(Afghan crisis)పై నేతలిద్దరూ మాట్లాడుకున్నారని పీఎంఓ తెలిపింది. అఫ్గాన్​లో శాంతిభద్రతలు కాపాడటం కీలకమని ఇరువురు పేర్కొన్నట్లు పీఎంఓ ప్రకటన వెల్లడించింది. అక్కడ చిక్కుకున్నవారిని రప్పించేందుకు నేతలు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.