ETV Bharat / bharat

ల్యాప్​టాప్​ బ్యాగ్​పై డౌట్.. చెక్ చేస్తే రూ.50కోట్ల డ్రగ్స్.. కిలో బంగారం మింగేసి..

author img

By

Published : Nov 27, 2022, 7:32 PM IST

Updated : Nov 29, 2022, 11:55 AM IST

DRI recovered drugs worth 50 crores 2 foreign nationals arrested in mumbai
ఎయిర్​పోర్టులో పట్టుబడిన డ్రగ్స్, బంగారం

ముంబయి ఎయిర్​పోర్టులో రూ.50కోట్లు విలువైన డ్రగ్స్​ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అనుమానంతో డీఆర్ఐ అధికారులు ఇద్దరు ప్రయాణికుల బ్యాగ్​లను సోదా చేయగా 7.9 కేజీల హెరాయిన్​ పట్టుబడింది. మరోవైపు కేరళ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద రూ.48.5 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్​పోర్టులో పట్టుబడిన రూ.50కోట్ల విలువైన డ్రగ్స్

ముంబయి ఛత్రపతి శివాజీ ఎయిర్​పోర్టులో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టుబడింది. జింబాబ్వే దేశీయులైన ఇద్దరు వ్యక్తులపై అనుమానంతో డీఆర్ఐ(డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆ వ్యక్తుల నుంచి 7.9కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నిఘా వర్గాల సమాచారంతో డీఆర్ఐ ముంబయి జోనల్ యూనిట్ అప్రమత్తమయింది. అనుమానంతో అడిస్ అబాబా(ఇథియోపియా) నుంచి భారత్​కు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అడ్డగించారు. వారిద్దరినీ చెక్​ చేయగా ఓ బ్యాగ్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు అరల్లో లేత గోధుమరంగులో రెండు పౌడర్ ప్యాకెట్స్ లభించాయి. ఆ పౌడర్ ప్యాకెట్లను పరీక్షించగా హెరాయిన్ అని అధికారులు గుర్తించారు.

.
.
DRI recovered drugs worth 50 crores 2 foreign nationals arrested in mumbai
బ్యాగ్​లోని ప్రత్యేక అరలో చెక్ చేస్తున్న అధికారులు

మొత్తం 7.9కేజీల బరువున్న ఆ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.50కోట్ల విలువుంటుందని ఓ అధికారి తెలిపారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న డ్రగ్స్ సిండికేట్​ను పట్టుకునేందుకు డీఆర్​ఐ తదుపరి విచారణ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.

.
.

కేరళ విమానాశ్రయంలో రూ.48.5లక్షల బంగారం పట్టివేత..
కేరళ కొచ్చి విమానాశ్రయంలో రూ.48.5లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదా చేయగా క్యాప్స్యూల్స్​ రూపంలో శరీరంలో దాచిన 1192 గ్రాముల బంగారం లభ్యమైంది. అతని వద్ద ఉన్న మూడు బంగారు గొలుసులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated :Nov 29, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.