ETV Bharat / bharat

'ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు- సాధారణం కంటే ఎక్కువ వర్షాలు'- IMD గుడ్​న్యూస్​ - Southwest Monsoon

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 6:45 AM IST

Updated : May 16, 2024, 7:09 AM IST

Southwest Monsoon 2024 : నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటిచింది. మే31కి రెండు రోజులు అటుఇటుగా కేరళలో ప్రవేశించనున్నట్లు తెలిపింది.

Southwest Monsoon 2024
Southwest Monsoon 2024 (ANI)

Southwest Monsoon 2024 : దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో విత్తనాలు వేసే జూన్‌, జులై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర అన్నారు.

భారత వాతవరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్​ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్​8న, 2022లో మే 29న, 2021లో జూన్​ 3న, 2020లో జూన్​1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.

సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
అయితే ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్​లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.

2024లో సాధారణ స్థాయిలోనే వర్షాలు
మరోవైపు దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవైట్ వాతావరణ సంస్థ ఇటీవలె అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలకు దీర్ఘ కాల సగటు 868.6 మిమీలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఎండలతో మండిపోయిన 'ఏప్రిల్‌'- అత్యంత వేడి నెలగా రికార్డ్! - April Warmest Month

'ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్​'- CAA అమలయ్యాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం - Citizenship Amendment Act

Last Updated : May 16, 2024, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.