ETV Bharat / bharat

టీచర్​ను ఈవ్ టీజింగ్ చేసిన విద్యార్థులు.. క్లాస్​కు వెళ్తుంటే ఇష్టమొచ్చినట్టుగా...

ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎంతో గౌరవంగా ఉంటారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. మహిళా టీచర్​ను ఈవ్​ టీజింగ్​​ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఆశ్రమంలో చదువుతున్న మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ ఆశ్రమ డైరెక్టర్​. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

students abuse lady teacher
టీచర్​ను టీజింగ్ చేసిన విద్యార్థులు
author img

By

Published : Nov 27, 2022, 2:36 PM IST

మహిళా ఉపాధ్యాయురాలిపై 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈవ్​ టీజింగ్​కు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లోని ఓ పాఠశాలలో జరిగింది. టీచర్ క్లాస్​కు వెళ్లే సమయంలో 'ఐ లవ్​ యూ మేడమ్'​, 'ఓయ్ మేడమ్'​, 'ఇటు చూడు' అంటూ అసభ్యకర పదజాలాన్ని వాడారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వాళ్లే వీడియో తీశారు. ఆ సమయంలో మహిళా ఉపాధ్యాయులు తలదించుకుని క్లాస్​రూమ్​కు వెళ్లిపోయారు.

అనంతరం ముగ్గురు విద్యార్థులపై ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తనను చాలా కాలంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. చాలా సార్లు తన క్లాసులో కూడా ఇలానే ప్రవర్తించేవారని వాపోయారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆశ్రమ పాఠశాలలో..
మహారాష్ట్ర నాసిక్​లోని జ్ఞాన్​దీప్​ గురుకుల్​ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. అక్కడ చదువుతున్న ఐదుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ ఆశ్రమ డైరెక్టర్ హర్షల్ మేరే. అందులో నలుగురు మైనర్లు ఉన్నారు. ఈ విషయం బయట చెబితే ఆశ్రమం నుంచి బయటకు పంపేస్తామని బెదిరించాడు. దీంతో బాధితులు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

జ్ఞానదీప్ గురుకుల్ ఆశ్రమంలో ఉండే 14 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తన బంధువుకు ఈ దారుణం గురించి చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుుకున్నారు. పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పుడే మైనర్ల పట్ల నిందితుడి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం బయటపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.