ETV Bharat / entertainment

OG Glimpse : OG గ్లింప్స్ డీటైల్స్​ లీక్.. తెలుగులోనే తొలిసారి అలా.. ఇది తెలిస్తే గూస్​బంప్సే!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 12:19 PM IST

OG Glimpse : పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్​ తెలిసింది. ఆ వివరాలు..

OG Glimpse : OG గ్లింప్స్ డీటైల్స్​ లీక్.. తెలుగులోనే తొలిసారి అలా.. ఇది తెలిస్తే గూస్​బంప్సే!
OG Glimpse : OG గ్లింప్స్ డీటైల్స్​ లీక్.. తెలుగులోనే తొలిసారి అలా.. ఇది తెలిస్తే గూస్​బంప్సే!

OG Glimpse : రీసెంట్​గా పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ బ్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన చేతిలో 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్​ భగత్ సింగ్​', 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాలు ఉన్నాయి. అందులో యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'OG'. 1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో పలు షెడ్యూళ్లను కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే 50 శాతంపైగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్​ ఇప్పటివరకు రాలేదు. అయితే ఇటీవలే.. హై ఓల్టేజ్ యాక్షన్‌ సీన్స్​తో ఓ గ్లింప్స్​ను(FireStormIsComing) పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్​.

OG Glimpse Pawan Kalyan : ఈ గ్లింప్స్​లో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని రెండు మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి. ఈ మూవీ గ్లింప్స్ వీడియో 72 సెకెన్లు లేదా 1.12 నిమిషాల నిడివితో రాబోతుందని తెలిసింది.

ఇందులో పవన్ కల్యాణ్ స్టైలిష్ గెటప్‌తో కనిపిస్తారట. తమన్​ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉండనుందని చెబుతున్నారు. ఇక ఈ గ్లింప్స్ క్లైమాక్స్‌లో పవన్ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతారని, అవి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయట. మొత్తంగా ఈ వీడియో టాలీవుడ్‌లో ఎప్పుడూ చూడని విధంగా ఓ స్పెషల్​ అనుభూతిని ఇవ్వబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో TheyCallHimOG పేరుతో తెగ ట్రెండింగ్ అవుతోంది.

Pawan Kalyan OG Release Date : ఇకపోతే ఈ చిత్రాన్ని RRR నిర్మాత దానయ్య.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Pawan Kalyan OG Movie : పవన్ ఫ్యాన్స్ గెట్​ రెడీ.. అగ్ని తుపాన్‌ వచ్చేస్తోంది

నెల గ్యాప్​లో పవన్ 'ఉస్తాద్​' - 'ఓజీ'.. అసలు అయ్యే పనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.