ETV Bharat / entertainment

Pawan Kalyan OG Movie : పవన్ ఫ్యాన్స్ గెట్​ రెడీ.. అగ్ని తుపాన్‌ వచ్చేస్తోంది

author img

By

Published : Aug 10, 2023, 2:49 PM IST

Pawan Kalyan OG Movie : హీరో పవన్​కల్యాణ్ - సాహో ఫేమ్ దర్శకుడు సుజిత్ కాంబినేషన్​లో 'ఓజీ' సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్​ను మూవీమేకర్స్ విడుదల చేశారు. ఇంతకీ ఈ పోస్టర్ ఎలా ఉందంటే..

Pawan Kalyan OG Movie Poster :
ఓజీ సినిమా ఫస్ట్ పోస్టర్

OG Movie First Look : పవర్​స్టార్​ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. పవన్​ కల్యాణ్​ - సుజిత్‌ కాంబోలో తెరకెక్కుతోన్న 'ఓజీ' (Original Gangster) నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా రివీల్‌ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్​ 2 న పవన్‌ కల్యాణ్‌ బర్త్​డే సందర్భంగా ఫ్యాన్స్​ కోసం ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసి ఈ అప్​డేట్​ను తెలియజేసింది.

Pawan Kalyan OG Movie Poster : తాజా పోస్టర్​లో పవన్​ తన అనుచరులతో కలిసి నడుస్తున్నట్లు కనిపించారు. శత్రువులను చంపిన తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నట్లు ఆయన కనిపించారు. "లొకేషన్‌ : చర్చ్‌గేట్‌ , సౌత్‌ బొంబాయి, టైమ్‌: 2.19 (ఏ.ఎం.), రైన్‌ఫాల్‌ డెన్సిటీ: 24 ఎం.ఎం, బ్లడ్‌ ఫ్లో డెన్సిటీ: 32 ఎం.ఎం, వెపన్స్‌ యూజ్డ్‌: sawed off double, Barreled Shotgun" అంటూ డీటైల్స్​ను పోస్టర్​పై వెల్లడించింది. ఇది చూస్తుంటే.. సినిమాలో యాక్షన్​ సీన్స్​కు కొదువలేదనిపిస్తోంది.

అలాగే, "హీట్ వేవ్​ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండండి. #Fire Strom Is Coming (అగ్ని తుపాన్‌ వస్తోంది)" అంటూ ప్రొడక్షన్ హౌజ్​ పేర్కొంది. ఈ ఊరమాస్ పోస్టర్ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. అయితే హీరో పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమా షూటింగుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక బ్రో సినిమా సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్న పవర్​స్టార్ ఫ్యాన్స్.. ఈ పోస్టర్​ చూసి తెగ సంబరపడిపోతున్నారు.

ఈ సినిమా కథ జపాన్‌ - ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. ఈ చిత్రంలో హీరో పవన్‌కల్యాణ్‌ ఒరిజినల్​ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. పవన్​కు జోడీగా, హీరోయిన్ ప్రియా అరుళ్‌ మోహన్‌ నటించనున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, నటుడు ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

''బ్రో' మూవీకి పవన్ రెమ్యునరేషన్.. ప్రపంచంలో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు'

స్పీడ్​ పెంచిన పవన్.. చేతిలో ఐదు సినిమాలు.. మరో యంగ్​ డైరెక్టర్​కు ఛాన్స్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.