ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Aug 4, 2021, 6:59 PM IST

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

ప్రధాన వార్తలు @ 7PM

  • Polavaram: జంతర్ మంతర్​లో పోలవరం నిర్వాసితుల ఆందోళన.. జాతీయ నేతల మద్దతు

దిల్లీలోని జంతర్​ మంతర్ వద్ద పోలవరం ముంపు బాధితులు నిరసన చేపట్టారు. బాధితులకు జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పోలవరం భూనిర్వాసితులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • vidhya kanuka: ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభోత్సవం

ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నూతన విద్యా విధానంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త విద్యా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్​ అధికారులకు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • AP CORONA CASES: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా 2వేల 442 కొవిడ్ కేసులు నమోదు కాగా.. 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి 2 వేల 412 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

దేశానికి పతకం అందించడం ఎంతో గర్వంగా ఉందని ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. భవిష్యత్​లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'మూడో వేవ్ రాలేదు.. వచ్చే అవకాశం తక్కువే!'

దేశంలో కరోనా థర్డ్​వేవ్​పై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే.. రెండో వేవ్ స్థాయిలో ఉంటుందా? అంతకన్నా ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • కొవిడ్​ మరణాల లెక్కలపై కేంద్రం క్లారిటీ

కొవిడ్​ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. కొన్ని కరోనా కేసులను గుర్తించలేకపోయినప్పటికీ, మరణాలను తక్కువగా నమోదు చేయడం కుదరదని పేర్కొంది. భారత్​ మరణాల రిజిస్ట్రేషన్​ వ్యవస్థలో అన్నింటినీ నమోదు చేస్తారని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • కొవిడ్​ కట్టడికి కేరళ 'కొత్త వ్యూహం'- గురువారం నుంచే...

కేరళలో గత కొద్ది రోజులుగా రోజుకు 20వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న కేసుల్లో సగం అక్కడే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి కొత్త వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది కేరళ. కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 5 ఉదయం 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • అప్పటి పరిస్థితిని తలచుకొని మస్క్ కంటతడి!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్(​Elon Musk) ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు. అప్పట్లో స్పేస్​ ఎక్స్​ను మూసివేయాల్సిన పరిస్థితిని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను 'టెస్లా ఓనర్స్‌ ఆఫ్‌ సిలికాన్‌వ్యాలీ' గ్రూప్ ట్విట్టర్​లో షేర్ చేయగా.. అది వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • Tokyo Olympics: హాకీ సెమీస్​లో భారత మహిళా జట్టు ఓటమి

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. సెమీఫైనల్​లో భారత అమ్మాయిలు ప్రపంచ నంబర్‌వన్‌ టీమ్​ అర్జెంటీనాపై పోరాడి ఓడారు. కీలకమైన సెమీస్‌లో రాణి రాంపాల్‌ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • టీజర్​​తో 'ఇందువదన'.. రీతూవర్మ 'నాగిని డ్యాన్స్​'

యువహీరో వరుణ్ సందేశ్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం 'ఇందువదన'. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్​ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.