ETV Bharat / business

ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే చాలు - డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్సీ అవసరమే లేదు! - Digilocker Mparivahan Mobile Apps

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 11:36 AM IST

Digilocker And Mparivahan Mobile Apps : అర్జంట్‌ పనిమీద బైక్‌ లేదా కారులో బయల్దేరతాం. సడెన్​గా ట్రాఫిక్‌ పోలీసులు ఆపి డ్రైవింగ్ లైసెన్స్‌ అడుగుతారు. అది ఇంట్లో ఉంటుంది! ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే.. మీ ఫోన్‌లో ఒక్క యాప్‌ ఉంటే చాలు! ఎటువంటి పత్రాలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ యాప్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mobile Apps
Digilocker And Mparivahan Mobile Apps (ETV Bharat)

Digilocker And Mparivahan Mobile Apps : బైక్‌ మీద లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు మెజార్టీ జనాలు.. డ్రైవింగ్ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ కార్డు) వంటి ఇతర పత్రాలు తమ వెంట పెట్టుకోవడం మర్చిపోతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్‌ పోలీసులు ఆపి డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని అడిగితే అరెరే.. ఇంట్లో మర్చిపోయానే అని సమాధానం చెబుతుంటారు. ట్రాఫిక్ సిబ్బంది కన్విన్స్​ కాకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

ఇలాంటి అనుభవం చాలా మంది వాహనదారులకు ఎదురవుతుంది. అయితే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం ఒక్క యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. చాలు ఎటువంటి ఫిజికల్‌ డాక్యుమెంట్స్ మీరు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి.. ఆ యాప్‌ ఏంటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

డ్రైవింగ్ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ కార్డు) వంటి ఇతర పత్రాలు చాలా ముఖ్యమైనవి. వాహనం రోడ్డెక్కితే ఇవి తప్పకుండా వెంట ఉండాల్సిందే. కానీ.. పలు సందర్భాల్లో వాటిని ఇంట్లోనే మర్చిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం రెండు యాప్‌లను రూపొందించింది. అవి ఒకటి 'డిజిలాకర్' (digilocker), రెండోది mParivahan యాప్‌. ఈ రెండు యాప్స్ కూడా వాహనాలకు సంబంధించిన పత్రాలను భద్రపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిల్లోని డాక్యుమెంట్‌లను మీరు ట్రాఫిక్‌ పోలీసులకు చూపించి.. జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డిజిలాకర్, mParivahan యాప్‌లలో ఏ డాక్యుమెంట్‌లను భద్రపరచుకోవచ్చు ?

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌
  • వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ కార్డు)
  • పొల్యుషన్‌ సర్టిఫికెట్‌
  • ఇన్సురెన్స్ వంటి ఇతర పత్రాలను భద్రపరచుకోవచ్చు.

mParivahan మొబైల్ యాప్‌ :
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ mParivahan మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇందులో వాహనదారుడికి సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ కార్డు వంటి పత్రాలను సాఫ్ట్‌ కాపీల రూపంలో భద్రపరచుకోవచ్చు.

డిజిలాకర్ (Digilocker) :
డిజిలాకర్ అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక వర్చువల్ లాకర్ సదుపాయం. కేంద్రం డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ సేవలను 2015 జూలైలో అధికారికంగా ప్రారంభించింది. డిజిలాకర్, mParivahan యాప్స్ రెండూ దేశ వ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి. కాబట్టి.. బైక్, కారు డ్రైవింగ్‌ చేసేవారు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ వంటి ఇతర పత్రాల హార్డ్‌ కాపీలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఈజీగా మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని సర్వీసులను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిజిలాకర్​తో మీ డాక్యుమెంట్లు సేఫ్.. ఎలా వాడాలో తెలుసా..?

How to Apply Learners License through Parivahan Sewa: ఆన్​లైన్​లో లెర్నర్​ లైసెన్స్​ కోసం ఇలా అప్లై చేయండి..!

పెట్రోల్​ బంక్​ నడుపుతారా? - ఒకసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.