ETV Bharat / sitara

టీజర్​​తో 'ఇందువదన'.. రీతూవర్మ 'నాగిని డ్యాన్స్​'

author img

By

Published : Aug 4, 2021, 5:18 PM IST

వరుణ్​ సందేశ్ 'ఇందువదన' టీజర్, 'వరుడు కావలెను' చిత్రంలోని 'దిగు దిగు నాగన్న' పాట.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి.

Induvadana, Varudu Kavalenu
ఇందువదన, వరుడు కావలెవను

యువహీరో వరుణ్ సందేశ్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం 'ఇందువదన'. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. ఈ సినిమా టీజర్​ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే 'ఇందువదన' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో నటీనటులు, దర్శక నిర్మాతలు చిత్ర విశేషాలను పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరో జానపదం..

తెలుగు తెరపై జానపదాల జోరు పెరుగుతోంది. ఇప్పటికే పలు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించి చిత్రాల విజయంలో కీలకంగా నిలువగా.. నాగశౌర్య, రీతూవర్మ 'వరుడు కావలెను'లో మరో జానపద గీతం సినీ ప్రియులను అలరించేందుకు వచ్చింది. 'దిగు దిగు నాగ' అంటూ అశేష ఆదరణ పొందిన ఈ జానపదాన్ని ఈ సినిమా కోసం ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తనదైన శైలిలో మలిచారు. తమన్ సంగీతం అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు. కథానుగుణంగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ పాట.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్​టైన్​మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ఒకే రోజు 16 పాటలు.. అమ్మ మందలించింది: సింగర్ చిత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.