ETV Bharat / bharat

Skill Development Case Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 6:50 PM IST

Updated : Sep 10, 2023, 10:32 PM IST

chandrababu
cbn

09:46 September 10

చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలింపు

Skill Development Case Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో వచ్చిన ఆరోపణలపై రిమాండ్‌ విధించాలన్న సీఐడీ అభ్యర్థనపై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌ విధిస్తున్నట్లు పేర్కొంది.

CID Submitted Remand Report in ACB Court.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు నేటి ఉదయం 8 గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఆ రిపోర్ట్‌లో.. చంద్రబాబును సీఐడీ ఏ37గా పేర్కొన్నారు. ఈ నేరంలో ఆయనే.. ముఖ్యమైన కుట్రదారని వివరించారు. 2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని.. వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు, 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.

Chandrababu Case Arguments : చంద్రబాబుపై కేసు రాజకీయ ప్రేరేపితం.. ఆధారాల్లేకుండానే సెక్షన్-409 ఎలా..? : సిద్ధార్థ లూథ్రా

Arguments of Lawyers on CID Report.. ఇందుకోసం.. రాష్ట్రప్రభుత్వ వాటాగా డిజైన్ టెక్ లిమిటెడ్‌కు రూ.371 కోట్లు విడుదల చేశారని..ఏపీ సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చెల్లింపులు జరిగిన మొత్తానికి వస్తు సేవలను డిజైన్ టెక్ సంస్థ అందించలేదని సీఐడి పేర్కొంది. రూ.241 కోట్లకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్టు.. మహారాష్ట్రలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు తెలిపింది. నకిలీ బిల్లులతో షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి.. హవాలా ద్వారా నిధులు కాజేశారని ఆరోపించింది.

Arguments in ACB Court: లాయర్​ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత

CID explained Many Things in The Report.. అంతేకాకుండా, 2015-2019 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన డిజైన్ టెక్‌కు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని..సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో తుది లబ్దిదారు.. చంద్రబాబు అని వివరించింది. గతంలో చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు (PA) పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ద్వారా.. నిధులు స్వీకరించారని తెలిపింది. ఈ కేసులో A1 సహా పలువురు నిందితులను అరెస్ట్ చేశామని సీఐడీ రిపోర్ట్‌లో పేర్కొంది.

ACB Court Remanded Chandrababu.. ఈ నేపథ్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. చంద్రబాబు తరుఫున విజయవాడ ఏసీబీ కోర్టులో సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. చంద్రబాబుకు రిమాండ్‌ విధించారు.

LIVE UPDATES: చంద్రబాబుకు రిమాండ్‌.. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధింపు

Last Updated :Sep 10, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.