ETV Bharat / bharat

LIVE UPDATES: చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్న సీఐడీ పోలీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 6:22 AM IST

Updated : Sep 10, 2023, 11:00 PM IST

chandrababu naidu
chandrababu naidu

22:59 September 10

చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశం

  • చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశం
  • మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశం
  • చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశం
  • ఇంటి ఆహారం తీసుకునేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశం

22:59 September 10

రాష్ట్ర ప్రజలకు లేఖ రాసిన నారా లోకేష్‌

  • రాష్ట్ర ప్రజలకు లేఖ రాసిన నారా లోకేష్‌
  • కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నా: లోకేష్‌
  • తెలుగువారి అభ్యున్నతి కోసం మా నాన్న ఎంతో శ్రమించారు: లోకేష్‌
  • లక్షలమంది జీవితాల్లో మార్పు రావాలని నిత్యం తపించేవారు: లోకేష్‌
  • చంద్రబాబుకు విశ్రాంతి తీసుకోవడం తెలియదు: నారా లోకేష్‌
  • నాన్న నుంచి ప్రేరణ పొంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా: లోకేష్‌
  • అమెరికాలో ఉద్యోగం వదిలిమరీ దేశానికి తిరిగివచ్చా: నారా లోకేష్‌
  • రాజకీయ పగలు, కక్షలకు హద్దులు లేవా?: నారా లోకేష్‌
  • మా నాన్న పోరాట యోధుడు.. నేనూ అంతే..: నారా లోకేష్‌
  • ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని ప్రజలను కోరుతున్నా: నారా లోకేష్‌

22:58 September 10

గన్నవరం దాటాక చంద్రబాబు కాన్వాయ్‌ను ఆపిన పలువురు యువకులు

  • గన్నవరం దాటాక చంద్రబాబు కాన్వాయ్‌ను ఆపిన పలువురు యువకులు
  • మూడు నిమిషాలపాటు ఆగిన చంద్రబాబు కాన్వాయ్‌
  • చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్తున్న దారిలో ఆగిన వీధిలైట్లు
  • హనుమాన్ జంక్షన్ బైపాస్‌లోకి ప్రవేశించిన చంద్రబాబు వాహన శ్రేణి
  • భారీ వర్షంలోనే ముందుకెళ్తున్న చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌

22:57 September 10

నియంత పాలనపై కలిసి పోరాడదామని లోకేశ్​కు చెప్పిన పవన్

  • నారా లోకేశ్​ ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కల్యాణ్‌
  • ధైర్యంగా ఉండాలని నారా లోకేశ్​ను కోరిన పవన్ కల్యాణ్‌
  • నియంత పాలనపై కలిసి పోరాడదామని లోకేశ్​కు చెప్పిన పవన్

22:07 September 10

చంద్రబాబుకు హౌస్‌ అరెస్టు పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు

  • చంద్రబాబుకు హౌస్‌ అరెస్టు పిటిషన్‌పై రేపు విచారణ
  • రేపు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
  • చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉందన్న ఆయన న్యాయవాదులు
  • చంద్రబాబుకు హౌస్‌ అరెస్టు అవకాశం కల్పించాలని కోరిన న్యాయవాదులు

22:06 September 10

జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరిన చంద్రబాబు.. అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు

  • జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరిన చంద్రబాబు
  • తన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు కోరిన చంద్రబాబు
  • ఆహారం, వసతి, ఇతర ఏర్పాట్లకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు

21:36 September 10

రేపు తెదేపా తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు జనసేన, సీపీఐ మద్దతు

  • రేపు తెదేపా తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు జనసేన మద్దతు
  • రేపు తెదేపా తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు సీపీఐ మద్దతు

21:31 September 10

ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబును తరలిస్తున్న సీఐడీ పోలీసులు

  • ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబును తరలిస్తున్న సీఐడీ పోలీసులు
  • చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్న సీఐడీ పోలీసులు
  • విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం
  • జైలుకు తరలించేందుకు రెండు గంటలకు పైగా పట్టే అవకాశం

21:07 September 10

చంద్రబాబుకు ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది: పవన్‌ కల్యాణ్‌

  • చంద్రబాబుకు ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది: పవన్‌ కల్యాణ్‌
  • అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబును జైలుకు పంపారు: పవన్‌
  • అధికారంలోకి వచ్చాక ఇసుక దొంగలను వదిలే ప్రసక్తే లేదు: పవన్‌ కల్యాణ్‌
  • తుదిశ్వాస వరకు జగన్‌పై పోరాటం చేస్తా: పవన్‌ కల్యాణ్‌
  • యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేం సిద్ధం: పవన్‌ కల్యాణ్‌
  • జగన్.. నువ్వు జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలా?: పవన్‌ కల్యాణ్‌
  • తెలంగాణలో జగన్‌ను రాళ్లతో తరిమికొట్టారు: పవన్‌ కల్యాణ్‌
  • రేపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి రావచ్చు: పవన్‌ కల్యాణ్‌
  • జగన్ రాష్ట్రానికి హానికరం.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన బాధ్యత: పవన్‌
  • వారాహి యాత్రపై దాడికి 2 వేలమంది నేరగాళ్లను దింపారు: పవన్‌
  • కోనసీమ జిల్లాలో 50 మందిని చంపేయాలని కుట్ర పన్నారు: పవన్‌
  • వైకాపా మూకల కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దాన్ని నిలువరించారు: పవన్‌
  • చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరు: పవన్‌
  • ఈ ప్రభుత్వం.. రాజకీయాలను మరో స్థాయికి దిగజార్చింది: పవన్‌ కల్యాణ్‌

20:08 September 10

రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా

  • రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా
  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్‌కు
  • పిలుపునిచ్చామన్న అచ్చెన్నాయుడు

20:01 September 10

తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు.. రేపటి రోజు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది

  • తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు
  • రేపటి రోజు చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది
  • కార్యకర్తలు నిరాశపడాల్సిన పనిలేదు
  • లోకేశ్ నాయకత్వంలో న్యాయపోరాటం చేస్తాం
  • జగన్ రొమ్మువిరిచి నిలబడ్డారని సజ్జల అంటున్నారు
  • కోడికత్తి కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం ఇవ్వలేదు
  • సొంతబాబాయిని హత్య చేసిన వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టలేదు
  • కొందరు పోలీసు అధికారులను మీ కిరాయి జీతగాళ్లుగా భావిస్తున్నారు
  • మీ కిరాయి జీతగాళ్లుగా మారిన పోలీసు అధికారులపై పోరాటం కొనసాగిస్తాం
  • ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగంపైనా పోరాడతాం
  • కోర్టులను మేనేజ్ చేయడం జగన్‌కు తప్ప వేరెవరికీ చేతకాదు

19:51 September 10

చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉందని.. హౌస్‌ అరెస్టులో ఉండే అవకాశం కల్పించాలన్న న్యాయవాదులు

  • చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉందని తెలిపిన ఆయన న్యాయవాదులు
  • చంద్రబాబుకు హౌస్‌ అరెస్టులో ఉండే అవకాశం కల్పించాలన్న న్యాయవాదులు
  • హౌస్‌ అరెస్టు అవకాశాల సాధ్యాసాధ్యాలపై కొనసాగుతున్న చర్చలు
  • చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న న్యాయమూర్తి

19:25 September 10

చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్‌

  • విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌
  • చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్‌
  • సీఐడీ కస్టడీ పిటిషన్‌ను రేపు విచారించే అవకాశం

19:20 September 10

చంద్రబాబుకు రిమాండ్‌.. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధింపు

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధింపు

18:54 September 10

చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించే అవకాశం

  • చంద్రబాబుకు రిమాండ్‌
  • ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌
  • చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు రిమాండ్‌
  • చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించే అవకాశం

18:18 September 10

కోర్టు హాలులో ఎక్కువమంది ఉన్నారని బయటకు పంపిస్తున్న సిబ్బంది

  • కోర్టు హాలులో ఉత్కంఠ వాతావరణం
  • చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు తీర్పుపై ఉత్కంఠ
  • కాసేపట్లో తీర్పు వెల్లడించనున్న న్యాయమూర్తి
  • కోర్టు హాల్‌లోకి వెళ్లిన చంద్రబాబు
  • కోర్టు హాలులోకి 30మందికే అనుమతి
  • కోర్టు హాలులో ఎక్కువమంది ఉన్నారని బయటకు పంపిస్తున్న సిబ్బంది

18:09 September 10

నిజాయతీ రాజకీయ నాయకుల్లో అతికొద్దిమందిలో చంద్రబాబు ఒకరు: కేశినేని నాని

కేశినేని నాని

  • అంతా పాజిటివ్‌గా ఉందని మా అందరి భావన
  • నిజాయతీ రాజకీయ నాయకుల్లో అతికొద్దిమందిలో చంద్రబాబు ఒకరు
  • ఈ కేసులో పస లేదని మా భావన
  • రాష్ట్రంలో యువత బాగుపడాలి.. ఉద్యోగాలు రావాలని సంకల్పించారు
  • సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు
  • ఏరకంగా చూసినా చంద్రబాబుకు... ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు
  • రాక్షస రాజ్యం.. నిరంకుశ పాలన నడుస్తోంది
  • అధికారులను లొంగదీసుకుని వాళ్లకు కావాల్సినట్లు చెప్పించుకుంటున్నారు
  • కచ్చితంగా చంద్రబాబు బయటకు వస్తారు
  • న్యాయం.. ధర్మం... గెలుస్తుంది

15:51 September 10

మీడియా ప్రతినిధులను కూడా కోర్టు ప్రధాన రహదారిలోకి అనుమతించని పోలీసులు

  • విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • సంపూర్ణ పోలీసు పహారాలో విజయవాడ కోర్టు పరిసరాలు
  • విజయవాడ: కోర్టు పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
  • మీడియా ప్రతినిధులను కూడా కోర్టు ప్రధాన రహదారిలోకి అనుమతించని పోలీసులు
  • కోర్టు ప్రాంగణం, పరిసరాల్లో బందోబస్తును పరిశీలించిన విజయవాడ సీపీ

15:22 September 10

ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది: సిద్ధార్థ లూథ్రా

  • స్కిల్ డెవలప్మెంట్ కేసు రాజకీయ ప్రేరేపితం: సిద్ధార్థ లూథ్రా
  • 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి: లూథ్రా
  • హైకోర్టులో తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది, ఈ కేసు ఎప్పుడో ముగిసింది: లూథ్రా
  • ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ వచ్చింది: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలు: సిద్ధార్థ లూథ్రా
  • ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది: సిద్ధార్థ లూథ్రా
  • సెక్షన్409 చంద్రబాబుకు వర్తించదు: న్యాయవాది : సిద్ధార్థ లూథ్రా
  • ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్నందున సెక్షన్ 409 వర్తించదు: సిద్ధార్థ లూథ్రా
  • ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది?: సిద్ధార్థ లూథ్రా
  • రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించండి: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు: సిద్ధార్థ లూథ్రా
  • ప్రభుత్వం తాను అనుకున్నచోటే చంద్రబాబును మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టింది: సిద్ధార్థ లూథ్రా
  • కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదు: సిద్ధార్థ లూథ్రా
  • సీఐడీ ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లబోవడం లేదు: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబును ఉ. 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబును శుక్రవారం రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు: సిద్ధార్థ లూథ్రా
  • శుక్రవారం రాత్రి 11కు అరెస్ట్ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి: సిద్ధార్థ లూథ్రా
  • రాత్రి 11 గంటలకు చుట్టుముట్టడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే: సిద్ధార్థ లూథ్రా
  • సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి: సిద్ధార్థ లూథ్రా
  • పోలీసుల గత 48గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి: సిద్ధార్థ లూథ్రా
  • అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం: సిద్ధార్థ లూథ్రా
  • ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే: సిద్ధార్థ లూథ్రా
  • రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలి: సిద్ధార్థ లూథ్రా
  • అరెస్టు అంటే అర్థం ఏమిటో సీఐడీ లాయర్లకు వివరించిన సిద్దార్థ లూథ్రా
  • రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించిన లూథ్రా

14:38 September 10

విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు

  • విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
  • ఉదయం 8 నుంచి సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు

14:02 September 10

విజయవాడ ఏసీబీ కోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు

  • విజయవాడ ఏసీబీ కోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు
  • భోజన విరామం అనంతరం కోర్టులో ప్రారంభమైన వాదనలు
  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు
  • సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు

13:58 September 10

ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఆగమేఘాల మీద అరెస్టు చేశారు: మందకృష్ణ

  • చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: మందకృష్ణ
  • పాలకులు చెప్పినట్లు పోలీసులు చేసినట్లు కనిపిస్తోంది: మందకృష్ణ మాదిగ
  • హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్‌ను అరెస్టు చేయట్లేదు: మందకృష్ణ
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఆగమేఘాల మీద అరెస్టు చేశారు: మందకృష్ణ
  • అజేయ కల్లం, ప్రేమేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవట్లేదు: మందకృష్ణ మాదిగ
  • పార్టీలు ఆందోళన చేపడితే ఎంఆర్‌పీఎస్‌ మద్దతు ఉంటుంది: మందకృష్ణ మాదిగ

12:47 September 10

మధ్యాహ్నం 1.30 తర్వాత ప్రారంభం కానున్న వాదనలు

  • కేసు విచారణకు గంట పాటు భోజన విరామం
  • మధ్యాహ్నం 1.30 తర్వాత ప్రారంభం కానున్న వాదనలు

12:27 September 10

విజయవాడ: పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట

  • విజయవాడ ఏసీబీ కోర్టు చుట్టుపక్కల ఉన్న టీడీపీ నేతలు అరెస్టు
  • టీడీపీ మహిళా కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
  • విజయవాడ: పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
  • టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, నాదెండ్ల బ్రహ్మం, ఇతర నేతల అరెస్టు

12:13 September 10

రెండేళ్లలో 36 మందిపై అభియోగాలు మోపారు: తెలంగాణ మాజీ ఏజీ రామకృష్ణారెడ్డి

  • చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది: తెలంగాణ మాజీ ఏజీ రామకృష్ణారెడ్డి
  • ఇది రెండేళ్ల క్రితం నమోదైన కేసు: తెలంగాణ మాజీ ఏజీ రామకృష్ణారెడ్డి
  • రెండేళ్లలో 36 మందిపై అభియోగాలు మోపారు: రామకృష్ణారెడ్డి
  • ఈ కేసులో కొంతమంది రిమాండ్‌ను కోర్టులు తిరస్కరించాయి: రామకృష్ణారెడ్డి
  • ఈ కేసులో కొంతమంది ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు: రామకృష్ణారెడ్డి
  • ఇదే కేసులో కొంతమంది బెయిల్‌ మీద బయట ఉన్నారు: రామకృష్ణారెడ్డి
  • ఇలాంటి సమయంలో చంద్రబాబును అకస్మాత్తుగా ఎందుకు అరెస్టు చేశారు: రామకృష్ణారెడ్డి
  • ఉన్నట్లుండి సెక్షన్‌ 409 కింద అభియోగాలు మోపి చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారు: రామకృష్ణారెడ్డి
  • మంత్రిమండలి సమష్టి నిర్ణయంలో ఒక సభ్యుడిపై కేసు ఎలా పెడతారు?: రామకృష్ణారెడ్డి

11:49 September 10

విరామం అనంతరం మళ్లీ కొనసాగనున్న వాదనలు

  • రెండోసారి స్వల్ప విరామం ప్రకటించిన న్యాయమూర్తి
  • విరామం అనంతరం మళ్లీ కొనసాగనున్న వాదనలు

11:35 September 10

శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి :లూథ్రా

  • స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం: సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: లూథ్రా
  • ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదన్న కోర్టు
  • రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామన్న అదనపు ఏజీ
  • 2021లో కేసు పెడితే ఇప్పటివరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్న కోర్టు
  • 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు
  • చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారు : లూథ్రా
  • శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి :లూథ్రా

11:11 September 10

తెలుగు మహిళలను వాహనాల్లో ఎక్కించిన పోలీసులు

  • విశాఖ ఎంవీపీ కాలనీలో తెదేపా నేతల నిరాహారదీక్ష
  • విశాఖ: నిరాహార దీక్ష శిబిరాన్ని భగ్నం చేసిన పోలీసులు
  • తెలుగు మహిళలను వాహనాల్లో ఎక్కించిన పోలీసులు

11:10 September 10

సీఐడీకి జగన్ ప్రైవేట్ సైన్యంగా నామకరణం చేయాలి: సీపీఐ

  • తిరుపతిలో సీపీఐ నేత రామకృష్ణ మీడియా సమావేశం
  • రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం: సీపీఐ నేత రామకృష్ణ
  • సమావేశం తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపుతాం: సీపీఐ
  • కక్షసాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారింది: సీపీఐ
  • రాష్ట్రాభివృద్ధి కంటే జగన్‌కు ప్రతీకార వాంఛ ముఖ్యం: సీపీఐ
  • సీఐడీకి జగన్ ప్రైవేట్ సైన్యంగా నామకరణం చేయాలి: సీపీఐ
  • అవినాష్ అరెస్టుకు 4 రోజులు గెస్ట్‌హౌస్‌లో సీబీఐ ఏంచేసింది: సీపీఐ
  • మాజీ సీఎం సహకరించకపోతే బస్సు లాక్కుపోతామన్నారు: సీపీఐ
  • రెండేళ్ల క్రితం నుంచి చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదు: సీపీఐ
  • పోలీసు రాజ్యంలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయి: సీపీఐ
  • హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలి: సీపీఐ

10:48 September 10

స్వల్ప విరామం అనంతరం ప్రారంభమైన వాదనలు

స్కిల్ స్కామ్ పేరిట కేసులు నమోదు చేయడం రాజకీయ ప్రేరేపితమని.... చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదించారు. ఈ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా F.I.Rలో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించగా... రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ తెలిపారు. 2021లో కేసు పెడితే ఇప్పటివరకూ చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్న కోర్టు అడిగింది. 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగుతున్నాయి. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. సెక్షన్ 409 పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్నారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు.

లూథ్రా ఇచ్చిన నోటీసు మేరకు తిరస్కరణ వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ఈమేరకు వాదనలు వినిపించిన లూథ్రా.... సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలంటూ పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూథ్రా ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఆయన హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందన్న లూథ్రా.... శుక్రవారం ఉదయం 10 గటంల నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించాలన్నారు. ఇక ఈ కేసులో సీఐడీ తరఫున అడి।।షనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసి... 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. స్కిల్ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు ఏఏజీ తెలిపారు. 2015లోనే స్కామ్ మొదలైందన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి... జీవో నెంబర్ 4 జారీలో కుట్ర దాగి ఉందన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని వాదించారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతించాలని సుధాకర్ రెడ్డి కోరారు.

10:19 September 10

ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు: చంద్రబాబు

  • కోర్టుకు తన అభిప్రాయాలను నివేదించుకున్న చంద్రబాబు
  • రాష్ట్రంలో పూర్తిగా కక్షసాధింపు పాలన కొనసాగిస్తున్నారు: చంద్రబాబు
  • ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు: చంద్రబాబు
  • రాష్ట్రంలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగట్లేదు: చంద్రబాబు
  • రాష్ట్రంలో పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది: చంద్రబాబు
  • గవర్నర్‌ అనుమతి లేకుండానే నన్ను అరెస్టు చేశారు: చంద్రబాబు
  • తన అరెస్టు అక్రమమన్న చంద్రబాబు
  • స్కిల్ స్కామ్‍తో నాకెలాంటి సంబంధం లేదన్న చంద్రబాబు
  • రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్న చంద్రబాబు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కేబినెట్‌ నిర్ణయం: చంద్రబాబు
  • ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు: చంద్రబాబు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చాం: చంద్రబాబు
  • రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది: చంద్రబాబు
  • అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు: చంద్రబాబు
  • 2021 డిసెంబర్‌ 9 నాటి ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు: చంద్రబాబు
  • అప్పటి రిమాండ్‌ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదు: చంద్రబాబు

10:15 September 10

15 నిమిషాలు విరామం ప్రకటించిన న్యాయమూర్తి

  • విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ తరఫున పూర్తయిన వాదనలు
  • 15 నిమిషాలు విరామం ప్రకటించిన న్యాయమూర్తి
  • విరామం తర్వాత తన వాదనలు కొనసాగించనున్న సిద్ధార్థ లూథ్రా

10:14 September 10

దేశంలో ఏ ఒక్కరినీ అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారు: అచ్చెన్నాయుడు

  • రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్‌ పని: అచ్చెన్నాయుడు
  • ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆనందపడుతున్న వ్యక్తి జగన్‌: అచ్చెన్నాయుడు
  • జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరింది: అచ్చెన్నాయుడు
  • తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబును స్కిల్‌ కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారు: అచ్చెన్నాయుడు
  • దేశంలో ఏ ఒక్కరినీ అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారు: అచ్చెన్నాయుడు

09:52 September 10

అపాయింట్‌మెంట్‌ రద్దు చేసినట్టు తెలిపిన రాజ్‌భవన్‌ వర్గాలు

  • విశాఖ: తెదేపా నేతలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ రద్దు చేసిన గవర్నర్‌
  • మొదట ఇవాళ ఉ. 9.45గం.కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన గవర్నర్‌
  • తాజాగా అపాయింట్‌మెంట్‌ రద్దు చేసినట్టు తెలిపిన రాజ్‌భవన్‌ వర్గాలు
  • ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

09:39 September 10

కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని సీఐడీని ప్రశ్నించిన న్యాయమూర్తి

  • కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని సీఐడీని ప్రశ్నించిన న్యాయమూర్తి

09:32 September 10

రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని నోటీసు ఇచ్చిన సిద్ధార్థ లూథ్రా

  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • 409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూథ్రా వాదనలు
  • 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్న లూథ్రా
  • రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని నోటీసు ఇచ్చిన సిద్ధార్థ లూథ్రా
  • తిరస్కరణ వాదనలకు అవకాశం కల్పించిన న్యాయమూర్తి
  • రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని సిద్దార్థ లూథ్రా వాదనలు

09:30 September 10

24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టాం: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

  • సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు
  • నిన్న ఉ. 6 గం.కే చంద్రబాబును అరెస్టు చేశాం: ఏఏజీ పొన్నవోలు
  • 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టాం: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
  • స్కిల్ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశాం: ఏఏజీ పొన్నవోలు

09:24 September 10

అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు: చంద్రబాబు

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కేబినెట్‌ నిర్ణయం: చంద్రబాబు
  • ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు: చంద్రబాబు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చాం: చంద్రబాబు
  • రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది: చంద్రబాబు
  • అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు: చంద్రబాబు
  • 2021 డిసెంబర్‌ 9 నాటి ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు: చంద్రబాబు
  • అప్పటి రిమాండ్‌ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదు: చంద్రబాబు

08:56 September 10

తన అరెస్టు అక్రమమన్న చంద్రబాబు

  • విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • న్యాయస్థానంలో చంద్రబాబు స్టేట్‌మెంట్‌ రికార్డు పూర్తి
  • ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు
  • చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి
  • కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు
  • తన అరెస్టు అక్రమమన్న చంద్రబాబు
  • స్కిల్ స్కామ్‍తో నాకెలాంటి సంబంధం లేదన్న చంద్రబాబు
  • రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్న చంద్రబాబు
  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు
  • సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు

08:52 September 10

ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు

  • విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • న్యాయస్థానంలో చంద్రబాబు స్టేట్‌మెంట్‌ రికార్డు పూర్తి
  • ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు
  • చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి
  • కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు
  • తన అరెస్టు అక్రమమన్న చంద్రబాబు
  • స్కిల్ స్కామ్‍తో నాకెలాంటి సంబంధం లేదు :చంద్రబాబు
  • రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్న చంద్రబాబు :చంద్రబాబు

08:22 September 10

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు

LIVE UPDATES: ఏసీబీ కోర్టులో చంద్రబాబు.. ప్రారంభమైన వాదనలు
  • విజయవాడ: ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు
  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు
  • సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు

07:55 September 10

చంద్రబాబును ఏ37గానే పేర్కొంటూ రిమాండ్‌ రిపోర్టు దాఖలు చేసీన సీఐడీ

  • విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు
  • చంద్రబాబును ఏ37గానే పేర్కొంటూ రిమాండ్‌ రిపోర్టు దాఖలు చేసీన సీఐడీ
  • ఇవాళ ఉదయమే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ
  • 2021 ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు
  • ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్‌ రిపోర్టు ఇచ్చిన పోలీసులు
  • 15 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఇవ్వాలన్న సీఐడీ
  • సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద రిమాండ్‌ రిపోర్టు సమర్పణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారని పేర్కొన్న సీఐడీ
  • ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న సీఐడీ
  • 2021 డిసెంబర్‌ 9 కంటే ముందు నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టు
  • తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా అక్రమాలు జరిగాయని వెల్లడి
  • వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని వెల్లడి
  • సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారన్న సీఐడీ
  • రూ.271 కోట్లు షెల్‌ కంపెనీలకు మళ్లించారని రిమాండ్‌ రిపోర్టు

07:10 September 10

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు

  • విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు
  • ఓపెన్‌ కోర్టులో వాదనలు వినాలని జడ్జికి విజ్ఞప్తి చేసిన తెదేపా లీగల్‌ టీమ్‌
  • తెదేపా లీగల్‌ టీమ్‌ విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి
  • చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు
  • సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు

07:03 September 10

విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు

  • విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు
  • విజయవాడ కోర్టు ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • కోర్టు పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

06:38 September 10

కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీఐడీ

  • విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు
  • కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీఐడీ
  • కాసేపటి క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ
  • 2021 ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు
  • ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్‌ రిపోర్టు ఇచ్చిన పోలీసులు

06:30 September 10

కొద్దిసేపటి క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ

  • కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీఐడీ
  • కొద్దిసేపటి క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ
  • 2021 ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు
  • ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్‌ రిపోర్టు ఇచ్చిన పోలీసులు
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
  • సీఐడీ తరఫున హాజరుకానున్న అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

06:17 September 10

కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం

  • 24 గంటలు ముగిసే సమయంలో కోర్టుకు చంద్రబాబు
  • విజయవాడ: ఏసీబీ కోర్టుకు చేరుకున్న చంద్రబాబు
  • కాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం
  • సిట్‌ కార్యాలయం నుంచి చంద్రబాబును కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు
  • ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు

06:17 September 10

కొన్ని దస్త్రాలపై సంతకాల కోసమంటూ సిట్ కార్యాలయానికి తరలింపు

  • విజయవాడ: ఏసీబీ కోర్టుకు చంద్రబాబు తరలింపు
  • సిట్‌ కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తరలిస్తున్న పోలీసులు
  • ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
  • వైద్యపరీక్షల ఆనంతరం తిరిగి సిట్‌ కార్యాలయానికి చంద్రబాబు తరలింపు
  • కొన్ని దస్త్రాలపై సంతకాల కోసమంటూ సిట్ కార్యాలయానికి తరలింపు
  • ఇప్పటికే ఏసీబీ కోర్టుకు చేరుకున్న లోకేష్‌, న్యాయవాదులు

06:16 September 10

ఆస్పత్రి వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న సిటీ పోలీసు కమిషనర్‌

  • సిట్‌ కార్యాలయం నుంచి చంద్రబాబు తరలింపు
  • వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి చంద్రబాబు తరలింపు
  • భారీ భద్రత మధ్య బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్‌
  • తనకోసం రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలను చూసి అభివాదం చేసిన చంద్రబాబు
  • విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు
  • ఆస్పత్రి వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న సిటీ పోలీసు కమిషనర్‌
  • వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు చంద్రబాబు
  • న్యాయస్థానం వద్దకు చేరుకున్న లోకేష్, భువనేశ్వరి
  • ఏసీబీ కోర్టు వద్ద న్యాయవాదులతో మాట్లాడుతున్న నారా లోకేష్‌
  • ఏసీబీ కోర్టు వద్దకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

06:16 September 10

కారులో విజయవాడకు వస్తున్న పవన్‌కల్యాణ్‌కు మార్గం మధ్యలో అడ్డంకులు

  • పవన్‌కల్యాణ్ విజయవాడ పర్యటనకు పోలీసుల అడుగడుగున ఆటంకాలు
  • విమానంలో విజయవాడ వచ్చేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు
  • కారులో విజయవాడకు వస్తున్న పవన్‌కల్యాణ్‌కు మార్గం మధ్యలో అడ్డంకులు
  • విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన పవన్‌
  • మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద పవన్‌కల్యాణ్‌ను విడిచిపెట్టిన పోలీసులు

06:15 September 10

చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ అధికారులు

  • చంద్రబాబును కోర్టుకు తరలించేందుకు వాహనాలు సిద్ధం చేస్తున్న అధికారులు
  • సీఐడీ సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబును తరలించేందుకు ఏర్పాట్లు
  • చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ అధికారులు

06:15 September 10

సెక్షన్ 17పీసీ యాక్ట్ ప్రకారం గవర్నర్‌ అనుమతి కావాలని వాదన

  • మాజీ సీఎం అరెస్టుకు గవర్నర్‌ అనుమతి తప్పనిసరని తెదేపా లీగల్‌సెల్‌ వాదన
  • సెక్షన్ 17పీసీ యాక్ట్ ప్రకారం గవర్నర్‌ అనుమతి కావాలని వాదన
  • గవర్నర్‌ అనుమతిని సీఐడీ ఓవర్‌ లుక్‌ చేసిందన్న తెదేపా లీగల్‌సెల్‌
  • గవర్నర్‌ అనుమతి లేకపోవడంతో రిమాండ్‌ రిజెక్ట్‌ అవుతుందన్న తెదేపా వర్గాలు
  • గవర్నర్ అనుమతి తీసుకున్నామని సీఐడీ చూపగలిగితే వాదనలు కొనసాగింపు

06:14 September 10

  • చంద్రబాబును అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు: పవన్‌
  • వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం రేపు కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం: పవన్‌
  • బెయిల్ మీద బయట ఉన్న సీఎం జైలు గురించే ఆలోచిస్తారు: పవన్‌
  • అందర్నీ జైలుకి పంపాలనే ఆలోచిస్తారు: పవన్‌ కల్యాణ్‌
  • అతనో క్రిమినల్.. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి కావాలి: పవన్‌ కల్యాణ్‌
  • క్రిమినల్‌ చేతిలో అధికారం ఉండడం దురదృష్టం: పవన్‌ కల్యాణ్‌
  • తను క్రిమినల్..అందరూ క్రిమినల్స్ అవ్వాలని కోరుకుంటారు: పవన్‌ కల్యాణ్‌
  • ఏపీ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?: పవన్‌ కల్యాణ్‌
  • రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది: పవన్‌ కల్యాణ్‌
  • ప్రత్యేక విమానంలో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు: పవన్‌ కల్యాణ్‌
  • కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు: పవన్‌ కల్యాణ్‌
  • నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు: పవన్‌ కల్యాణ్‌
  • విశాఖలో కూడా ఇలాగే చేశారు..ఏం చేయాలి: పవన్‌ కల్యాణ్‌
  • గూండాలు, దోపిడి చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది: పవన్‌
  • దేశానికి చాలా ప్రతిష్టాత్మకమైన జీ20 సమ్మిట్ జరుగుతోంది: పవన్‌ కల్యాణ్‌
  • జీ20 దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు ఇలాంటివి చేయడం పీఎం స్ఫూర్తికి మచ్చ: పవన్‌

06:13 September 10

పోలీసుల తీరుపై పవన్‌కల్యాణ్‌ అసంతృప్తి

  • ఎన్టీఆర్‌ జిల్లా: ఆంధ్ర- తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
  • హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వస్తోన్న పవన్‌కల్యాణ్‌
  • గరికిపాడు చెక్‌పోస్టు వద్ద పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల తీరుపై పవన్‌కల్యాణ్‌ అసంతృప్తి
  • మంగళగిరి వరకు నడిచి వెళ్లాలని పవన్‌ నిర్ణయం
  • నడుచుకుంటూ ముందుకెళ్తోన్న పవన్‌ను అడ్డుకున్న పోలీసులు
  • గరికిపాడు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పవన్‌కల్యాణ్‌
  • కాసేపటికి పవన్‌కల్యాణ్‌ను వాహనంలో ముందుకెళ్లేందుకు అనుమతి
  • మళ్లీ అనుమంచిపల్లి వద్ద పవన్‌కల్యాణ్‌, మనోహర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఎక్కడికి తీసుకెళ్తున్నారో పవన్‌కు సమాచారం ఇవ్వని పోలీసులు
  • పోలీసుల తీరుపై పవన్‌ కల్యాణ్‌ అసహనం

06:13 September 10

విజయవాడ వెళ్లేందుకు పవన్‌కల్యాణ్‌కి అనుమతిచ్చిన పోలీసులు

  • విజయవాడ వెళ్లేందుకు పవన్‌కల్యాణ్‌కి అనుమతిచ్చిన పోలీసులు
  • అనుమంచిపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న పవన్‌కల్యాణ్ కాన్వాయ్
  • పవన్‌కల్యాణ్ కాన్వాయ్‌లో 3 కార్లకు అనుమతిచ్చిన పోలీసులు

06:04 September 10

ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు

  • పవన్‌కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్
  • పోలీసులే అల్లరి మూక‌ల మాదిరిగా చేయ‌డం దారుణం:
  • లోకేశ్ రాజ‌కీయ నేత‌ల‌ని అక్రమంగా నిర్బంధించ‌డం రాజ్యాంగ విరుద్ధం: లోకేశ్
  • పోలీసుల తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చ‌చ్చిపోయింది: లోకేశ్
  • ఎమ‌ర్జెన్సీ కంటే ఘోరంగా ఏపీలో ప‌రిస్థితులు ఉన్నాయి: లోకేశ్
Last Updated : Sep 10, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.