రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకున్న బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు బుద్ధి చెప్పాలి : బండి సంజయ్ - Bandi Sanjay Election campaign

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 11:58 AM IST

thumbnail
కరీంనగర్ బండి సంజయ్ ఇంటింటి ప్రచారం (ETV BARATH)

Bandi Sanjay Comments On Congress : నాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రెండూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. దేశంలో అధికారంలోకి వస్తామన్న భ్రమలో బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను పంచిందని, అలాగే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలనే కుట్రతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని బండి సంజయ్‌ ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బీజేపీని మరోమారు దీవించాలని కరీంనగర్‌లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలను సంజయ్ కోరారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డగోలుగా డబ్బులు ఖర్చుపెట్టి, కరీంనగర్​లో తనను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేయకున్నా, తామే చేసినట్లుగా చెప్పుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్​కు మళ్లీ ఓటు వేసి మోసపోవద్దని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఫీజు రియింబర్స్​మెంట్స్​ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో బుద్ది చెబుతారని విమర్శించారు. దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.