ETV Bharat / state

చేవెళ్లలో రేపు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ - ట్రాఫిక్ మళ్లించే రూట్లు ఇవే

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 8:31 PM IST

CM Revanth Reddy to start two schemes in Chevella
Traffic Restrictions in Congress Chevella Sabha

Traffic Diversions for Congress Chevella Meeting : రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుడుతూ, రేపు నిర్వహించబోయే కాంగ్రెస్ చేవెళ్ల సభకు సర్వం సిద్ధమవుతోంది. ఈమేరకు బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో, పోలీసు యంత్రాంగం ముందుగానే రద్దీని నివారించడానికి ట్రాఫిక్ చర్యలకు పూనుకుంది. సాధారణ ప్రజల సౌకర్యార్థం పలు ట్రాఫిక్ సలహాలను సైబరాబాద్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ జారీ చేశారు.

Traffic Diversions for Congress Chevella Meeting : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రేపు జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. ఈ సభా వేదికగా మరో రెండు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో, రద్దీని నియంత్రించటానికి పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు పూనుకుంది.

ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్​గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు

కాగా మంగళవారం రోజు సాయంత్రం బహిరంగ సభ దృష్ట్యా, మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి, సాధారణ ప్రజలు దారి మళ్లింపులను తీసుకోవాలని, ట్రాఫిక్ ఉచిత ప్రవాహాన్ని నివారించడంలో ట్రాఫిక్ పోలీసులకు(Traffic Police) సహకరించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ సూచించారు. సైబరాబాద్ చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవెళ్లలోని ఫరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. సాధారణ ప్రజల సౌకర్యార్థం పలు ట్రాఫిక్ సలహాలను పోలీస్ శాఖ జారీ చేసింది.

రాజేంద్రనగర్ ట్రాఫిక్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు : తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ(Police Academy) నుంచి చేవెళ్ల, వికారాబాద్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రగతి రిసార్ట్స్‌, యెంకేపల్లి ఎక్స్‌ రోడ్డు, ఆలూర్‌ ఎక్స్‌ రోడ్డు, వికారాబాద్‌ వైపు మళ్లించనున్నారు.

చేవెళ్ల ట్రాఫిక్ వాహనాలను పరిమితుల్లో ట్రాఫిక్ మళ్లింపు : వికారాబాద్‌ నుంచి చేవెళ్ల, మొయినాబాద్‌, హైదరాబాద్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఆలూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఆలూర్‌, యెంకేపల్లి ఎక్స్‌ రోడ్డు, ప్రగతి రిసార్ట్స్‌, హిమాయత్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-163(National High Way) నుంచి హైదరాబాద్‌ వైపు మళ్లిస్తారు. షాబాద్ నుంచి వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పమెన ఎక్స్ రోడ్డు వద్ద పమెన, బస్తేపూర్, ఎన్‌హెచ్ 163 వైపు మళ్లిస్తారు.

Traffic Restrictions in Congress Chevella Sabha : శంకరపల్లి నుంచి చేవెళ్ల వైపు వచ్చే ట్రాఫిక్‌ను యెంకేపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ఆలూర్‌ గేట్‌, ఎన్‌హెచ్‌ 163 వైపు మళ్లిస్తారు. హిమాయత్‌నగర్‌ నుంచి చేవెళ్ల వైపు వచ్చే ట్రాఫిక్‌ను ముడిమ్యాల గేట్‌, రావులపల్లి, మల్కాపూర్‌, చేవెళ్ల, ఎన్‌హెచ్‌ 163, వికారాబాద్‌ వద్ద మళ్లించనున్నట్లు పోలీసు శాఖ పేర్కొంది.

రూ.500కే గ్యాస్​ సిలిండర్​పై క్లారిటీ వచ్చేసింది​ - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!

అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.