ETV Bharat / state

'మీది మొత్తం వెయ్యి అయ్యింది యూజర్‌ ఛార్జెస్‌ ఎక్స్‌ట్రా’

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 5:11 PM IST

Hyderabad City Police Campaign On Traffic Rules : హైదరాబాద్ ఫుడ్ స్టాల్ వ్యాపారి కుమారి ఆంటీ "మీది మొత్తం 1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా" అనే డైలాగ్ తో సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యిపోయింది. ఇక తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం కుమారి ఆంటీ క్రేజ్ ని ఉపయోగించేసుకుంటున్నారు. ఒక వాహనదారుడు ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేస్తున్న ఫోటోని ట్రాఫిక్ పోలీసులు షేర్ చేస్తూ "మీది మొత్తం 1000 అయ్యింది. యూజర్ చార్జెస్ ఎక్స్‌ట్రా" అంటూ కుమారి ఆంటీ డైలాగ్ వెర్షన్​లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్​గా మారింది.

city police post photo cell phone driving bike
Telangana Traffic Police Different Fine

Hyderabad City Police Campaign On Traffic Rules : సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే అంశాలను ఉపయోగించుకుంటూ ట్రాఫిక్‌ నిబంధనలపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు(Hyderabad City Police) వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్‌ కోర్టుకు సంబంధించి పలు వీడియోలు, ఆమె మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీ గురించి మాట్లాడటం, ఆమెను కొందరు తమ సినిమాల ప్రమోషన్స్​కి కూడా ఉపయోగించుకోవడంతో ఓ రేంజ్​లో వైరల్‌ అయ్యారు. తాజాగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు కూడా కుమారీ ఆంటీ డైలాగ్​తో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

Hyderabad City Police Different Fine : హెల్మెట్ లేకుండా, సెల్‌ ఫోన్ మాట్లాడుకుంటూ ద్విచక్ర వాహనం నడుపుతున్న వాహనంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. 1000 రూపాయలు ఫైన్ వేసి దాన్ని ఎక్స్​లో వినూత్నంగా పోస్ట్ చేశారు. ఇటీవల వైరల్ అవుతున్న ఫుడ్ కోర్టు కుమారి అంటి డైలాగ్​తో పోస్టు పెట్టారు.

How to Check Status of TS e-Challans Online : మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా.. ఇప్పుడే మీ ఇ-చలాన్ స్టేటస్ చెక్ చేసుకోండిలా.!

ఒరిజినల్ డైలాగ్ ' మీది మొత్తం 1000 అయింది రెండు లివర్లు ఎక్ట్రా' అని ఉండగా వాహనదారుడి ఫోటోతో 'మీది మొత్తం థౌజెండ్ అయింది యూజర్ చార్జీలు ఎక్ట్రా' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు నెటజన్లను ఆకట్టుకుంటుంది. సిటీ ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రయత్నంపై నగర వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో జరిమానాలు జరిమానాలే, ఉల్లంఘనలు ఉల్లంఘనలే అన్నట్లుంది వాహనాలు నడిపేవారి పరిస్థితి. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎంత జరిమానా విధిస్తున్నా, వీటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 1,731 చొప్పున ట్రాఫిక్‌ ఉల్లంఘనలు (Traffic Challans Cases in Telangana) నమోదవుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Discounts on Traffic E Challan in Telangana : అయితే పెండింగ్ చలాన్లు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 25 వరకూ ఉన్న పెండింగ్‌ చలాన్లపై రాయితీ ప్రకటించింది. గత నెల 26 నుంచి ఫిబ్రవరి 15 వరకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, టీఎస్‌ఆర్టీసీ బస్సులు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించటంతో వాహనదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ రాయితీ ఫిబ్రవరి 11న ముగిసింది.

ఫైన్​లైనా కడతాం కానీ రూల్స్​ పాటించం - గంటకు 1,731 ట్రాఫిక్​ ఉల్లంఘనల కేసులు

పెండింగ్‌ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ - ఈ నెల 26 నుంచి ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.