ETV Bharat / state

ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు - వర్చువల్​గా 2 పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 3:00 PM IST

Updated : Feb 26, 2024, 4:31 PM IST

Priyanka Gandhi Telangana Tour cancelled : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. అయితే రేపు చేవెళ్లలో రెండు పథకాల ప్రారంభోత్సవంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్, ఉచిత విద్యుత్‌ పథకాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Priyanka Chevella Tour cancelled
Priyanka Gandhi Telangana Tour cancelled

Priyanka Gandhi Telangana Tour cancelled : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ యథాతథంగా రేపు చేవెళ్లలో గ్యాస్‌ సిలిండర్(Subsidy Gas), ఉచిత విద్యుత్‌(Free Power) పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పథకాలను ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రియాంక ప్రారంభించేలా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చేవెళ్లలో ప్రియాంక చేతుల మీదుగా రెండు గ్యారెంటీల పథకాలను ప్రారంభించాలని ఈ నెల 23న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.

Gas Cylinder Scheme in Telangana : మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారినీ మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్‌ చేసేందుకు రెడీ అవుతుంది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.955 ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్రం రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ను రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సమాచారం.

Congress Gas Cylinder Discount Scheme : ‘ఉజ్వల’ రాయితీ(Ujjwala Discount) పోనూ మిగతా మొత్తం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో ధర ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసమే అందుకు కారణం. రాష్ట్రంలో 11 లక్షల 58 వేల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వారికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ వస్తోంది. మహాలక్ష్మిలో (Mahalaxmi Scheme) ఎంపికైన గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్‌పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోనూ మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. సిలిండర్‌ ధర రూ.970 ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోగా, మిగతా 130ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేస్తుంది.

'ప్రపంచ దేశాలన్నీ మోదీ వైపు చూస్తున్నాయి - రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతాం'

రాష్ట్రంలో కేసీఆర్​పై కోపంతో కాంగ్రెస్​ను గెలిపించారు - ఎంపీ ఓటు మాత్రం బీజేపీకే అంటున్నారు : ఈటల రాజేందర్

Last Updated : Feb 26, 2024, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.