ETV Bharat / state

రాష్ట్రంలో కేసీఆర్​పై కోపంతో కాంగ్రెస్​ను గెలిపించారు - ఎంపీ ఓటు మాత్రం బీజేపీకే అంటున్నారు : ఈటల రాజేందర్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 12:45 PM IST

Updated : Feb 26, 2024, 3:38 PM IST

BJP Vijaya Sankalpa yatra in Gajwel : గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, ఎంతోమంది జైలుకు వెళ్లి వచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి కేంద్రంలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

BJP Vijaya Sankalp Yatra In Gajwel
BJP Etela Rajender Press Meet

BJP Etela Rajender Press Meet In Gajwel : దేశం సుభిక్షంగా, ఆత్మ గౌరవంతో బతకాలంటే మోదీకే ఓటు వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, ఎంతోమంది జైలుకు వెళ్లి వచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. 500 సంవత్సరాలకు పైబడి కొట్లాడిన అయోధ్య కానీ, త్రిబుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది మోదీ సర్కార్ అని తెలిపారు. కరోనా సమయంలో ఇతర దేశాలకు మందులు అందించిన ఘనత మోదీదే అని కొనియాడారు.

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ - రాష్ట్రంలో 10 మంది ఎంపీ అభ్యర్థిత్వాలపై రానున్న క్లారిటీ!

"గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ దేశ వ్యాప్తంగా ప్రజలు మోదీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి ఓటేసి మూడోసారి మోదీని గెలిపించుకుంటామనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చాక మహిళలకు బస్సు ఉచితం తప్ప ఏ హామీ నెరవేర్చలేదు. మోదీ సర్కార్ 500 సంవత్సరాలకు పైబడి కొట్లాడిన అయోధ్య కానీ, త్రిబుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది." ఈటల రాజేందర్, బీజేపీ నాయకుడు

రాష్ట్రంలో కేసీఆర్​పై కోపంతో కాంగ్రెస్​ను గెలిపించారు - ఎంపీ ఓటు మాత్రం బీజేపీకే అంటున్నారు : ఈటల రాజేందర్

BJP Vijaya Sankalp Yatra In Gajwel : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తన తరపున విన్నవిస్తున్నానన్నారు. ప్రపంచ చిత్ర పటంలో ఎదుగుతున్న దేశంగా ఉన్న భారత దేశానికి మోదీ ఎంతో గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు.

బీజేపీ విజయ సంకల్ప యాత్రలు : ఈసారి జరిగే లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంకల్ప యాత్రలను ప్రారంభించింది. కృష్ణమ్మ క్లస్టర్​, కుమురం భీం క్లస్టర్​, భాగ్యలక్ష్మి క్లస్టర్​, రాజరాజేశ్వర క్లస్టర్​ వంటి నాలుగు యాత్రలను ప్రారంభించగా, మరొకటి ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ క్లస్టర్స్​ అన్ని కలిపి రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్​ చేస్తాయి.

ప్రతిపక్షాలకు కిషన్​ రెడ్డి సవాల్ - 'తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలి'

బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక పొత్తుల దుష్ప్రచారం చేస్తున్నారు : రఘునందన్‌ రావు

Last Updated : Feb 26, 2024, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.