ETV Bharat / state

అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 7:35 AM IST

Congress Focus On Two Other Guarantees : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో గృహజ్యోతి పథకం కీలకమైనది. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ 2 వందల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మీటర్ రీడర్లు లబ్దిదారుల వివరాలను ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోతుందని, ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అంగన్‌వాడీలు, ఆశాలు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్(Gas Cylinder Scheme) దరఖాస్తులను పరిశీలించి ఆ వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు.

Congress Focus On Two Other Guarantees
Congress Focus On Two Other Guarantees

'గృహజ్యోతి, 500లకే గ్యాస్ సిలిండర్ అమలుపై దృష్టిసారించిన కాంగ్రెస్'

Congress Focus On Two Other Guarantees : గృహజ్యోతి పథకం అమలుపై డిస్కంలు కసరత్తు ప్రారంభించాయి. విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకానికి సంబంధించిన వివరాల సేకరణపై చర్చించారు. గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజుల నుంచి మీటర్ రీడర్‌లు ఇంటింటికీ తిరిగి గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తెల్లరేషన్‌ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నిక్షిప్తం చేస్తున్నారు.

'భారత్​ రైస్​' రేషన్​ దుకాణాల ద్వారా పంపిణీ చేయించాలి : రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం

Congress Griha Jyoti Scheme : దాదాపు తెల్ల రేషన్ కార్డుదారులనే 200ల యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్దిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు సుమారు రూ.93 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో కూడా మరింత వడపోత కార్యక్రమాలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో నివసిస్తున్న వారిలో ఎన్ని ఇళ్లకు వర్తింపజేయాలి? అద్దెకు ఉంటున్న వారిని లబ్దిదారులుగా ఎలా ఎంపిక చేయాలి? తదితర అంశాలపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

Congress : లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అందుకనుగుణంగా వివరాల సేకరణ కూడా పకడ్బందీగా చేపడుతున్నారు. గృహజ్యోతి పథకం వర్తించాలంటే బిల్లు జారీ సమయంలో ఆ నెలకు 200లోపు విద్యుత్తును మాత్రమే వినియోగించి ఉండాలి. పథకంలో చేరిన తర్వాత వినియోగదారులు బకాయిలు చెల్లించకపోతే, గృహజ్యోతిని అమలు చేసే అవకాశం ఉండదు. దాదాపుగా కర్ణాటకలో ఏ విధంగా 200ల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

రూ.500కే గ్యాస్​ సిలిండర్​ హామీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం - వీరే అర్హులు!

Electricity Free Under 200 Units : గృహ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు 34,59,585 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్‌కే గృహజ్యోతి పథకం అమలు చేయనున్నారు. రేషన్‌ కార్డుకు ఆధార్‌ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేసుకుని ఉండాలి. డిస్కమ్‌లు ఎట్టి పరిస్థితుల్లో కనెక్షన్‌పై పేరు మార్పిడీ చేయరాదు. ఏ వినియోగదారుడి పేరు ఉంటుందో అతడి పేరుతోనే బిల్లు జారీ అవుతుందని మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్‌ కార్డుతో పాటు రేషన్‌ కార్డు వివరాల సేకరణ ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ అధికారులను ఆదేశించారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు : 200 యూనిట్లలోపు కరెంట్‌ వినియోగించే వారు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టకపోయినా, వారి ఆధార్‌, ఆహార భద్రత కార్డుల వివరాలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అయితే గృహజ్యోతి వివరాలు సేకరించడం తమకు భారంగా మారుతుందని ఆర్టీజన్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమపై విపరీతమైన భారం పడుతుందని, ఇప్పుడు తాజాగా గృహజ్యోతి పథకం వివరాలు సేకరించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. తమకు 30 రోజుల పని దినాలు కల్పిస్తే ఎన్ని వివరాలు సేకరించేందుకైనా సిద్దమేనని స్పష్టం చేస్తున్నారు.

500 Cooking Gas Cylinder Scheme : లేదంటే తాము వివరాలు సేకరించబోమని ఇప్పటికే నిన్న విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను ఎంపిక చేసేందుకు సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన అర్జీలను అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేయించాలని నిర్ణయించింది.

ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకెళ్లి రేషన్‌కార్డు, ఎల్​పీజీ కంపెనీ పేరు, వినియోగదారు నంబర్‌, పాస్‌బుక్‌ సంఖ్య, రశీదు నంబర్లను పరిశీలిస్తారు. అర్హతలున్నాయనుకుంటే ఆయా వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలాల్లో ఎంపీడీవోలు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఆరు గ్యారంటీలకు అవరోధంగా ఆధార్ - సర్వీస్ సెంటర్ల వద్ద ప్రజల బారులు

Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.