ETV Bharat / state

వీధి శునకాలను అక్కున చేర్చుకున్న యువకుడు - మిత్రులతో కలిసి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 1:44 PM IST

Street Dog Lover Raghuram in Hyderabad : చాలా మందికి పెంపుడు జంతువులంటే ఎంతో ప్రేమ. ముఖ్యంగా శునకాలంటే మహాఇష్టం. వాటికోసం ఎంత ఖర్చైనా సరే వెచ్చించడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. మరి వీధి కుక్కులంటే చాలా మంది చులకనగానే చూస్తారు. వాటిని కనీసం దగ్గరకు కూడా రానివ్వరు. కానీ హైదరాబాద్‌కి చెందిన ఓ యువకుడు మాత్రం అలా కాదు. నెలకు లక్షల్లో ఖర్చు చేసి మరి వీధి శునకాల పట్ల తనకున్న ప్రేమను చాటుతున్నాడు. కొవిడ్‌ కారణంగా ఉద్యోగం పోయినా మూగజీవాల సంరక్షణను మాత్రం ఆపలేదు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది. వాటి సంరక్షణ కోసం అతను చేస్తున్న ప్రయత్నాలేంటి ఈ కథనంలో చూద్దాం.

Street Dog Lover
Street Dog Lover

వీధి శునకాలను అక్కున చేర్చుకున్న యువకుడు

Street Dog Lover Raghuram in Hyderabad : చుట్టూ పదుల సంఖ్యలో వీధి శునకాలు వాటిని ముద్దుగా పేర్లు పెట్టి పిలుస్తూ నుదిటిపై ప్రేమగా నిమురుతున్న ఈ యువకుడి పేరు రఘురాం. నేటి యువత ఆలోచనలు ఎంత కొత్తగా ఉంటాయో ఇతడిని చూసి చెప్పొచ్చు. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే యానిమల్ రెస్క్యూ ఆపరేషన్‌లో కూడా పనిచేశాడు. ఎన్నో మూగజీవాలను గత పదేళ్లుగా సంరక్షిస్తూ వాటి నేస్తంగా మారాడు రఘురాం.

ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం

Caring Home for Street Dogs : రఘురాం స్వస్థలం రాజమండ్రి. పుట్టి పెరిగిదంతా హైదరాబాద్‌. చిన్నప్పటి నుంచి శునకాలు, పక్షులంటే మహా ఇష్టం. తెలిసిన వారి పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనా లేదా ఆపదలో చిక్కుకున్నా నేనున్నానంటూ ముందుకు వచ్చేవాడు. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లలో కూడా ఈ జంతు ప్రేమికుడు పాల్గొనేవాడు.

"నేను యానిమల్ రెస్క్యూ ఆపరేషన్లలో పది సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను. షెల్టర్​ను స్థాపించి రెండు సంవత్సరాలైంది. జీవ వాత్సల్య రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్​ను ఏర్పాటు చేశాను. వీధి శునకాలకు మూడు పూటల భోజనంతో పాటు అనారోగ్యం పాలైన వాటికి చికిత్స అందిస్తున్నా. ఇందుకోసం నెలకు దాదాపు లక్షన్నరకుపైగా ఖర్చు అవుతుంది. - రఘురాం, రిహాబిలిటేషన్ నిర్వాహకుడు

కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయినా ఎప్పుడూ నిరుత్సాహపడలేదు రఘురాం. కానీ తన బాధంతా తనతో ఉన్న శునకాల గురించే. దాంతో వాటి పోషణ కోసం నెట్‌వర్క్ ఇంజినీర్‌గా ఫ్రీలాన్సింగ్‌ చేస్తున్నాడు. అయితే ఇలా ఎంతకాలం అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. మూగజీవాల సంరక్షణనే వ్యాపారంగా మలుచుకుందామని ప్రయత్నాలు చేశాడు. స్వార్థంతో చేసే వ్యాపారం సత్ఫలితాలను ఇవ్వదని గ్రహించాడు రఘురాం.

దీంతో తన మనసులో ఉన్న ఆలోచనలను స్నేహితులతో రఘురాం పంచుకున్నాడు. వీధి శునకాల కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. మిత్రుల సహకారంతో బాచుపల్లిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని జీవ వాత్సల్య రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్ (Jeeva Vatsalya Rescue Rehabilitation Centre) పేరుతో కేంద్రాన్ని మొదలు పెట్టాడు. రెస్క్యూ ఆపరేషన్లలో దొరికిన కుక్కలను, రోడ్లపై వదిలేసిన, రహదారి ప్రమాదాల్లో గాయపడ్డ వాటిని అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించాడు రఘురాం.

వీధి శునకాలకు మూడు పూటల భోజనంతో పాటు అనారోగ్యం పాలైన వాటికి రఘురాం నిరంతరం చికిత్స అందిస్తున్నాడు. ఇందుకోసం నెలకు దాదాపు లక్షన్నరకుపైగా ఖర్చు అవుతుందని చెబుతున్నాడు. ఇలా దాదాపు రెండేళ్లుగా ఈ జీవ వాత్సల్య కేంద్రాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రజల్లో మమకారం రెట్టింపైంది. అయితే అది ఇతర జాతులపై కాకుండా ఇండియన్ బ్రీడర్ లాంటి వీధి కుక్కలపై (Street Dogs) దృష్టి సారిస్తే మంచిదని సూచిస్తున్నాడు రఘురాం.

Pet Lover : మూగజీవాలంటే ఆమెకు ప్రాణం.. అందుకే

వీధి కుక్కల్లోనూ మేలైనా రకాలున్నాయని, వాటిని పెంచుకోవడం లేదా సంరక్షణ కేంద్రాల నుంచి దత్తత తీసుకోవడం లాంటివి చేయాలని రఘురాం కోరుతున్నాడు. దానివల్ల హైదరాబాద్ లాంటి మహానగరంలో శునకాల బెడద తగ్గించవచ్చని చెబుతున్నాడు.
అద్దె స్థలంలో రెండేళ్లుగా వీధి శునకాల షెల్టర్‌ను కొనసాగిస్తున్నాడు. భవిష్యత్‌లో వీటి కోసం ప్రత్యేక హోం నిర్మించాలనే ఆలోచనలో రఘురాం ఉన్నాడు.

Jeeva Vatsalya Rescue Rehabilitation Centre Bachupally : ఇందుకోసం దాతల సహకారం కోరుతూ వీధి శునకాలను సంరక్షిస్తున్నాడు. అలాగే వీధి కుక్కల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. మూగజీవాల పట్ల రఘురాం చూపిస్తున్న వాత్సల్యాన్ని జంతు ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

వీధి కుక్కలు, పిల్లుల కోసం ఇద్దరు మిత్రుల భిక్షాటన- హింసకు వ్యతిరేకంగా అవగాహన

రూ.90 కోట్ల ఆస్తి.. రోజుకు 1000 రోటీలు.. ఆ గ్రామంలో కుక్కలు సూపర్ రిచ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.