ETV Bharat / bharat

ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం

author img

By

Published : Oct 5, 2020, 1:43 PM IST

వీధి కుక్కల వల్ల ప్రమాదం ఉందని మనలో చాలా మంది తరచుగా అధికారులకు ఫిర్యాదు చేస్తారు. కానీ కేరళకు చెందిన ఓ 70ఏళ్ల బామ్మ.. వీధి కుక్కలే తన ప్రపంచంగా జీవిస్తోంది. 40కిపైగా శునకాల ఆలనా పాలనా చూసుకుంటోంది.

70-year-old woman foster cares more than 40 street dogs with her meagre resources
ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం!

ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం

మనలో అనేక మందికి జంతువులంటే చాలా ఇష్టం. ఓ ముద్ద ఆహారంగా పెడితే... మన మీద ఎంతో విశ్వాసం చూపే శునకాలంటే ఇంకెంతో ఇష్టం. మనం మహా అయితే ఒకటో రెండో కుక్కలను పెంచుకుంటాం. కానీ కేరళ కొట్టాయం జిల్లా కొడిమథాకు చెందిన అమ్మిణి అమ్మ ఏకంగా 40 వీధి కుక్కలను పెంచి పోషిస్తోంది.

70-year-old woman foster cares more than 40 street dogs with her meagre resources
ఆహారం కోసం ఎదురు చూస్తున్న శునకం

అలాంటి వాటినే..

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన శునకాలను తీసుకొచ్చి, వాటికి చికిత్స అందిస్తుంది అమ్మిణి. తన సొంత పిల్లల్లాగే వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, శునకాల కోసమే ఏర్పాటు చేసిన బోనుల్లో ఉంచి ఆహారం అందిస్తుంది. గత పన్నెండేళ్లుగా ఇదే పనిగా వాటికి సేవలందిస్తోంది ఆ 70ఏళ్ల బామ్మ.

70-year-old woman foster cares more than 40 street dogs with her meagre resources
శునకాన్ని ముద్దుగా నెమరుతున్న అమ్మిణి

ఎందుకంటే..

జనావాస ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్న శునకాలను.. ప్రజల ఫిర్యాదుల మేరకు నియంత్రించడానికి వాటిని చంపేస్తుంటారు మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు. ఈ క్రమంలోనే అమ్మ అల్లారుముద్దుగా పెంచుకున్న శునకాన్నీ చంపేశారు. అప్పటి నుంచి వీధి కుక్కల రక్షణ బాధ్యతను చేపట్టింది. ఈ పనిలో ఆమె కుమార్తె కూడా సాయం చేస్తుంటుంది. సమీపంలో నివసించేవారు కూడా తమ శునకాల్ని అమ్మిణి వద్ద వదిలి వెళ్తుంటారు.

70-year-old woman foster cares more than 40 street dogs with her meagre resources
శునకాలకు ఆహారం పెడుతున్న అమ్మిణి

పెట్రోలు బంకులో పని చేస్తూ..

తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ పెట్రోలు బంకులో పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు అమ్మిణి, ఆమె కుమార్తె. ఆ వచ్చిన ఆదాయంతోనే శునకాల ఆలనా పాలనా చూస్తున్నారు.

70-year-old woman foster cares more than 40 street dogs with her meagre resources
శునకాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులు

ఇదీ చూడండి: వైరల్​: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటోషూట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.