ETV Bharat / state

సెల్లార్​ నిర్మాణాలపై ముందస్తు అనుమతులు తీసుకోవాలి - స్పష్టం చేసిన హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 10:48 PM IST

Updated : Feb 23, 2024, 10:55 PM IST

High Court Judgment on  Building Regulations
High Court Judgment on 2012 Building Regulations

High Court Judgment on 2012 Building Regulations : 2012 భవన నిర్మాణ నిబంధనలపై తెలంగాణ హైకోర్టు పలు సూచనలు చేసింది. అపార్టమెంట్​ సెల్లార్​లో వాచ్​మెన్​ గదితో పాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గది నిర్మాణానికి నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ, ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

High Court Judgment on 2012 Building Regulations : అపార్ట్‌మెంట్ సెల్లార్​లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గదితో పాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణం మేర వీటి నిర్మాణం చేపట్టవచ్చని, అయితే ముందస్తు అనుమతి అవసరమని తేల్చి చెప్పింది. పార్కింగ్ నిమిత్తం ఉన్న సెల్లార్‌లో వాచ్​మెన్ గది నిర్మించడంపై జీహెచ్ఎంసీ(GHMC) ఈ నెల 7న జారీ చేసిన పోకాజ్ నోటీసును సవాలు చేస్తూ హైదరాబాద్ మోహన్‌ నగర్‌లోని సీటీఓ కాలనీలో అన్నపూర్ణ అపార్ట్​మెంట్స్ నిర్మాణదారు కె.రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్‌ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల్లో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్లో ఉన్న వాచ్​మెన్​ గదిని నిర్మించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీన్ని కూల్చివేస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం వాచ్​మెన్​ గది నిర్మాణం చేపట్టవచ్చన్నారు. కేవలం షోకాజ్ నోటీసు(Show Cause Notice) జారీ చేశామని, దీనికి వివరణ ఇవ్వడానికి పిటిషనర్‌కు అవకాశం ఉందని పురపాలకశాఖ తరఫు న్యాయవాది అన్నారు.

కన్నతండ్రిపైనే అత్యాచార ఆరోపణలు- 12ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల- లవర్​తో అలా చూసినందుకే

వాచ్‌మెన్‌ గది నిర్మాణానికి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గది నిర్మాణానికి నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ, ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, షోకాజ్ నోటీసుకు పిటిషనర్ ఈ నెల 24లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతేగాకుండా వాచ్‌మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు ఒకవేళ పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు(Applications) చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకునేదాకా కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

HC Questioned to State Govt about Sports Land Registration : మరో కేసులో క్రీడాభివృద్ధిలో భాగంగా ఐఎంజీకి అప్పగించిన భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తరువాత దీనికి బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా భూములను అప్పగించారంటూ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం దానికి కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంది. ఏకపక్షంగా భూములను అప్పగించిన వ్యవహారంలో ప్రభుత్వంలోనే దోషులున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో భాగంగా గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ మాజీ ఓఎస్​డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట

పీఎస్​లో మహిళ ఫిర్యాదును పట్టించుకోని కరీంనగర్ పోలీసులు - హైకోర్టు సీరియస్

Last Updated :Feb 23, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.