ETV Bharat / state

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ మాజీ ఓఎస్​డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 8:09 PM IST

High Court Removed Suspension Of OSD Harikrishna : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ మాజీ ఓఎస్​డీ హరికృష్ణకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో విద్యార్థినులపై లైంగిక వేదింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెండ్​ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను సస్పెండ్​ చేయడాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది.

Sexual Harassment in Hakimpet Sports School
High Court Removed Suspension Of OSD Harikrishna

High Court Removed Suspension Of OSD Harikrishna : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో లైంగిక వేదింపుల ఆరోపణలపై సస్పెండ్ అయిన మాజీ ఓఎస్‌డీ డా.హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. డా.హరికృష్ణను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో(Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. స్పోర్ట్స్‌ స్కూల్​లో చదువుతున్న విద్యార్థులు, సిబ్బంది నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన సస్పెండ్ చేయడం తగదని, ఇది నిబంధనలకు విరుద్ధమని హరికృష్ణ తరఫు న్యాయవాది పురుషోత్తం రెడ్డి వాదించారు. దీనికి సంబంధించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

"విద్యార్థినులు, తోటి ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా సరే విధుల నుంచి మాజీ ఓఎస్​డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఆ చర్యపై సవాలు చేస్తూ హైకోర్టులో రిట్​ పిటిషన్​ వేస్తే, సస్పెండ్​ ఉత్తర్వులను కొట్టివేశారు. దీనికి సంబంధించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా, సస్పెండ్​ అంశాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించి ఈ తీర్పును వెలువడించింది."-పురుషోత్తం రెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది

Hakimpet Sports School Case Update : లైంగిక వేదింపుల(Sexual Harassment) ఆరోపణలపై కమిటీ వేసినా, ఎలాంటి ఆధారాలు బయటపడలేదని ఆయన కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు, సస్పెండ్ ఉత్తర్వులను కొట్టేసింది. స్వార్థప్రయోజనాల కోసం తనను సస్పెండ్ చేసి మానసిక క్షోభకు గురి చేశారని మాజీ ఓఎస్‌డి హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వాళ్లపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు.

"నాకు జరిగిన అన్యాయానికి వేరే రకంగా అయితే ఎక్కడకో వెళ్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అంతగా మానసిక ఒత్తిడిని అనుభవించాను. అట్లాంటి పరిస్థితిలో నేను కోర్టుకు రావటం, మా అడ్వకేట్​ సాయంతో నేను ఇవాళ నిలబడి ఉన్నాను. నేను చేసింది న్యాయమా, అన్యాయమా అని విచారణ జరపడానికి ఒక ప్రిన్సిపల్​ ఉంది. ఆ తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇవేమీ చేయకుండా కొందరు అత్యుత్సాహంతో నన్ను బలిచేయటం ఏమిటి? అన్యాయం" -డా.హరికృష్ణ, మాజీ ఓఎస్డీ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్

ఇంతకీ ఏమి జరిగిందంటే? :

Hakimpet Sports School Incident : మేడ్చల్‌ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ ఓఎస్డీగా విధులు నిర్వహించిన హరికృష్ణ, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. ఈ అంశంపై స్పందించిన బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha), బాలికలకు వేధించడం తనను తీవ్రంగా కలిచి వేసిందని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని నాటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ మాజీ ఓఎస్​డీ హరికృష్ణకు తెలంగాణ హైకోర్టులో ఊరట

RS Praveen Kumar Respond on Hakimpet Sports School Incident : 'హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్ ఘటన.. ఆ ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలి'

Hakimpet Sports School OSD on Harrassment Allegations : నిజానిజాలు తేలాక సస్పెండ్ చేస్తే బాగుండేది: ఓఎస్డీ హరికృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.