GHMC Annual Budget 2024 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రకటించింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్ ప్రతులను(Budget Copy) కార్పొరేటర్లకు అందజేశారు. గత ఆర్థిక సంవత్సరం రూ.6,224 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.8,437 కోట్ల ఖరారు చేశారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని, అప్పులను దృష్టిలో పెట్టుకొని గతేడాది కంటే ఈసారి అదనంగా రూ.2,213 కోట్లను పెంచారు.
అధికారులపై కార్పొరేటర్ల ఆగ్రహం - జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ.5,938 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.3,458 కోట్లుగా ఉంటుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. రెవెన్యూ మిగులు రూ.2,480 కోట్లు, మూలధన రాబడులు రూ.1,999 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మూలధన వ్యయాన్ని రూ.4,479 కోట్లుగా ఖరారు చేసింది. అంతేకాకుండా ఈసారి బడ్జెట్లో డబుల్ బెడ్ రూంల(Double Bedroom) ఇళ్ల కోసం హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించారు.
GHMC Revenue Budget 2024 : ప్రతిపాదిత బడ్జెట్లో ప్లైఓవర్స్, స్కైవేలు, రోడ్ల అభివృద్ధి, రోడ్ల నిర్వహణ, అండర్ పాసుల కోసం రూ.1640 కోట్లు కేటాయించారు. నాళాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.380 కోట్లు కేటాయించారు. మార్కెట్లు, క్రీడా మైదానాలు(Sports Grounds), మహాప్రస్థానాలు, మరుగుదొడ్ల కోసం రూ.143 కోట్లు కేటాయించగా, జీహెచ్ఎంసీ పరిధిలో పచ్చదనం పెంపు కోసం ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ పేరుతో రూ.375 కోట్ల రూపాయలను కేటాయించారు. పురాతన కట్టడాల పరిరక్షణ, నిర్వహణ కోసం రూ.80 కోట్లు, అన్నపూర్ణ 5 రూపాయల భోజనం క్యాంటీన్ల కోసం రూ.25 కోట్లు, వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.255 కోట్లు కేటాయించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
GHMC Council Meeting Today : బడ్జెట్ విషయంలో జీహెచ్ఎంసీ చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని పలువురు కార్పొరేటర్లు మండిపడ్డారు. బడ్జెట్ ప్రతుల్లో అసంపూర్తి వివరాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై మంగళవారం మధ్యాహ్నం కౌన్సిల్ సమావేశంలో చర్చించి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి(Congress Govt) పంపనుంది. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ప్రవేశపెట్టిన తొలి వార్షిక బల్దియా బడ్జెట్ కావడంతో, మరింత ఆసక్తి నెలకొంది.
జీతం పడగానే ఒక్కో కార్మికుడి నుంచి రూ.500 వసూలు - బల్దియాలో ఫీల్డ్ అసిస్టెంట్ల అరాచకాలు!
రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటోంది : కేటీఆర్