ETV Bharat / business

కస్టమర్లకు SBI గుడ్​ న్యూస్​- FD రేట్లు పెంపు- ఆ రోజు నుంచే అమల్లోకి! - SBI FD Rates 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 12:48 PM IST

SBI FD Interest Rates 2024 : స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్​ న్యూస్ చెప్పింది. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు మే 15నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.

SBI FD Interest Rates 2024
SBI FD Interest Rates 2024 (ANI)

SBI FD Interest Rates 2024 : ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లు, అలాగే, రూ.2 కోట్ల పైన బల్క్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను సవరించింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రూ.2 కోట్లలోపు రిటైల్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ గరిష్ఠంగా 75 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై గతంలో వడ్డీ 4.75 శాతం ఉండగా, ఇకపై 5.50 శాతం చెల్లించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 5.25 శాతంగా ఉన్న ఈ వడ్డీని 6 శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై ప్రస్తుతం ఉన్న వడ్డీని 6 నుంచి 6.25 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 6.75 శాతం వడ్డీ లభించనుంది. రెండు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పులు చేయలేదు. సీనియర్ సిటిజన్లకు కూడా వడ్డీ రేట్లను అలాగే ఉన్నాయి.

రూ.2 కోట్ల బల్క్​ డిపాజిట్లపైనా
ఇక 7 రోజుల నుంచి 45 రోజుల బల్క్‌ డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్‌ పాయింట్ల మేర ఎస్‌బీఐ పెంచింది. ప్రస్తతం ఈ ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ అందిస్తుండగా, ఇకపై 5.25 శాతం చొప్పున వడ్డీ ఇవ్వనుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి వడ్డీ పెంచింది. గతంలో 5.75 శాతంగా ఉండేది. ఇదే కాలానికి సీనియర్‌ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

రూ.2కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు

సాధారణ పౌరులకు (%) సీనియర్ సిటిజన్లకు (%)
కాల వ్యవధి గతంలోసవరించినగతంలోసవరించిన
7-45 రోజులు 3.5 3.5 44
46-179 రోజులు4.75 5.5 5.266
180 - 210 రోజులు5.75 65.256.5
211- ఏడాది లోపు66.256.56.75
1-2 సంవత్సరాలు6.86.86.87.3
2-3 సంవత్సరాలు777.57.5
3-5 సంవత్సరాలు6.756.757.257.25
5-10 సంవత్సరాలు 6.56.57.507.50

మీరు హిందువులా? HUF రూల్స్ తెలుసుకుంటే - బోలెడు టాక్స్ బెనిఫిట్స్ గ్యారెంటీ​! - What Is HUF In Income Tax

'అమ్మాయిలూ.. ఈ కోర్స్ చేయండి.. మన ఫ్యూచర్ సూపర్!'- ఇషా అంబానీ సలహా - Isha Ambani Special Advice

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.