ETV Bharat / state

విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై విచారణ షురూ - సాక్ష్యాలు ఉంటే అందజేయాలంటూ విజ్ఞప్తి - Judicial Inquiry On Power

author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 1:10 PM IST

Electricity inquiry Commission : రాష్ట్రంలో 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి విచారణ సంఘం బహిరంగ ప్రకటన చేసింది. వీటికి సంబంధించిన సాక్ష్యాలు, అవగాహన ఉన్న వివరాలు ఎవరికైనా తెలిస్తే పది రోజుల్లో తెలియజేయాలని కోరింది.

Judicial Inquiry On Power Irregularities
Electricity inquiry Commission (ETV Bharat)

Judicial Inquiry On Power Irregularities : బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ రంగంలోకి దిగింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు ఛత్తీస్​గఢ్​తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలపై విచారణ మొదలుపెట్టింది.

రాష్ట్రంలో 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి విచారణ సంఘం బహిరంగ ప్రకటన చేసింది. వీటికి సంబంధించిన సాక్ష్యాలు, అవగాహన ఉన్న వివరాలు ఎవరికైనా తెలిస్తే పది రోజుల్లో తెలియజేయాలని కోరింది. 2014లో బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్‌ డిస్కమ్స్ నుంచి విద్యుత్‌ సేకరణకు సంబంధించి అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రంలో భగ్గుమంటున్న వేసవి ఎండలు - పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్ - Electricity demand in telangana

విద్యుత్ కొనుగోళ్లలో అవకతవలు : భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్‌ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడం సహా రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి 7 ఏళ్లు తీసుకోవడంపై వివరాలు కోరింది. డిస్కమ్‌లపై భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్‌ స్టేషన్‌ను దామరచర్లలో నిర్మించడానికి కారణాలు తెలపాలని బహిరంగ ప్రకటనలో కోరింది. బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా, నామినేషన్ ప్రాతిపదికన గుత్తేదారులతో ఒప్పందం కుదర్చుకోవడంపై సాక్ష్యాలు ఉంటే తెలపాలని పేర్కొంది. ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేకుండా వివరాలు సమర్పించాలని జస్టిస్‌ నరసింహారెడ్డి కోరారు.

పది రోజుల్లోగా ఈ-మెయిల్ ద్వారా లేదా బీఆర్కే భవన్‌కు పోస్టు ద్వారా తెలపాలని విజ్ఞప్తి చేసింది. అది ఎలాంటి సమాచారమైనా పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్‌‌ ఉద్యోగులు సైతం బహిరంగ విచారణలో పాల్గొని తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేయవచ్చునని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు తావులేకుండా విచారణ నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

మండే ఎండలకు కరెంట్ మీటర్​ గిర్రున తిరుగుతోందా - ఇలా చేస్తే 'బిల్లు' మన కంట్రోల్​లోనే! - Electricity Bill In Telangana

విద్యుత్‌ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ - అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ - Current Usage in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.