ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రజలకు మరో రెండు గ్యారంటీలు - అమలుకు సర్కార్ తీవ్ర కసరత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 7:50 AM IST

Updated : Jan 30, 2024, 7:56 AM IST

Congress Parliament Elections 2024
Congress

Congress Focus on Execution of 2 More Guarantees : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు వచ్చేలోగా ఐదు గ్యారంటీల్లో మరికొన్నింటిని అమలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్‌సభ షెడ్యూల్‌కు ముందే మరో రెండు గ్యారెంటీలు అమలు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో రెండు గ్యారంటీలు అమలుకు కాంగ్రెస్‌ కసరత్తు

Congress Parliament Elections 2024 : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కి వచ్చేలోగా ఐదు గ్యారంటీల్లో మరికొన్నింటిని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే వెంటనే ప్రవర్తనా నియామావళి అమల్లోకి వస్తుంది కాబట్టి కొత్త పథకాలు అమలు చేసేందుకు వీలుండదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకి ప్రతినెల 2,500 నగదు బదిలీ, 500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహ వినియోగదారులకు 5 లక్షల సాయం పథకాల్లో రెండిటినీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందుగా అమలు చేసేలా ఆర్ధికశాఖ కసరత్తు చేస్తోంది. ఏ పథకం కింద ఎంత మందికి ప్రయోజనం కలుగుతుంది.

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

Six Guarantees Budget : ఖజానాపై ఎంతభారం పడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహిళలకు ప్రతినెల 2,500 ఇచ్చే పథకానికి 92.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న వారిని మినహాయిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి వస్తుందనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఆ విధంగా లెక్క వేసినా దాదాపు 50 లక్షల మందికి ఇవ్వాల్సి రావచ్చని సమాచారం. ప్రతినెల ఎంత మొత్తం అవసరం అవుతుందో నిర్ధరణకు వచ్చి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 500కే గ్యాస్‌ సిలిండర్‌ కోసం 91.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

పీసీసీకి చేరిన కాంగ్రెస్ ఎంపీ ఆశావహుల లిస్ట్ - ఇంకా 10 జిల్లాలు బ్యాలెన్స్

ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తే దాదాపు 2 వేల 200 కోట్లకి పైగా ప్రభుత్వంపై భారం పడనుంది. ఆ రెండు అమలు చేస్తే మహాలక్ష్మీ పథకంలో పూర్తిగా నెరవేర్చినట్లు అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అమలుపైనా చర్చ జరుగుతోంది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా దీని అమలుపై చర్చించినట్లు సమాచారం. ఈ పథకానికి 82లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని వడపోయడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి మంచి స్పందన వచ్చిందని, మరో రెండు పథకాలు అమలు చేయడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో మరింత సానుకూల ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రభుత్వంలోని ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలు - ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ వైపు ప్రభుత్వం మొగ్గు!

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ

Last Updated :Jan 30, 2024, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.