ETV Bharat / state

ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలు - ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ వైపు ప్రభుత్వం మొగ్గు!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 7:09 AM IST

Telangana Budget 2024
Telangana Budget 2024

Telangana Budget Sessions 2024-25 : ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్‌ సమావేశంలో నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడుతున్నందున తెలంగాణలో అదేరీతిలో ముందుకెళ్లాలని యోచిస్తోంది. కుల గణన చేయాలని భావిస్తున్న సర్కార్‌ ఆ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కసరత్తు చేస్తోంది.

ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలు

Telangana Budget Sessions 2024-25 : శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను వచ్చేనెల రెండో వారంలో నిర్వహించడానికి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన తెలంగాణ బడ్జెట్‌ను (Telangana Budget 2024) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్రం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

Vote on Account Budget in Telangana 2024 : రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలా? లేదా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టాలా? (Vote on Account Budget ) అని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం శాసనసభ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాలి. ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని సమాచారం.

2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు షురూ చేసిన ప్రభుత్వం

Telangana Budget 2024 : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతుండడంతో, ఆలోపే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే వార్షికపద్దు రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు ఇవ్వడంతో, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నిశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాల్లో బీసీ కులగణన బిల్లు! : రాష్ట్రంలో కులగణనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లు పెట్టాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం దేశంలో జనగణన చేసినప్పుడు కులాలవారీగా లెక్కలు తీసింది. ఆ తర్వాత మళ్లీ కులాల వారీగా లెక్కలు తీయలేదు. బడుగు బలహీనవర్గాల మేలు కోసం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కులగణనను సత్వరంగా చేపట్టాలని సీఎం నిర్ణయించారు.

నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!

Caste Census Bill in Telangana : మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు కులగణన (TS Caste Census Bill) చేసేందుకు కృతనిశ్చయంతో ఉండడంతో సంబంధిత బిల్లుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పగించారు. గతేడాది బీహార్‌ సర్కార్ రెండు దఫాలుగా కులగణన సర్వేచేసింది. కర్ణాటకలో సోషియో ఎకనామిక్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సర్వే పేరిట గతంలో కులగణన చేపట్టారు. అవసరమైతే ఇప్పటికే కులగణన చేపట్టిన బిహార్‌, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరింత మెరుగైన విధానాలను రాష్ట్రంలో అమలు చేసేలా బిల్లు రూపొందించాలని సూచించారు.

ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్​ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?

రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.