ETV Bharat / state

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 7:24 AM IST

Congress Focus On Lok Sabha Elections 2024
Telangana Congress PEC Meeting Today

Telangana Congress PEC Meeting Today : ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇవాళ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది.

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

Telangana Congress PEC Meeting Today : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ 14 లోక్​సభ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటైన అభ్యర్థులను ఎంపిక చేయడం కీలకమైన అంశాలుగా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి, పార్టీ అనుబంధ విభాగాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపడం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, హామీల అమలు, బీఆర్ఎస్ అధికారంలో ఉండి వ్యవస్థలను ఏ విధంగా విధ్వంసానికి గురి చేసింది, ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరి, వైఫల్యాలు తదితర అంశాలను జనంలోకి గడప గడపకూ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్​ రెడ్డి

Congress Focus On Lok Sabha Elections 2024 : తద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవడం లాంటివి విస్తృతంగా చేపట్టాలని, అప్పుడే క్షేత్ర స్థాయికి ప్రభుత్వ పథకాలు చేరతాయని పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ టికెట్ ఆశిస్తున్న నాయకులు దాదాపు వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితాను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి(PCC) పంపారు. సోమవారం రాత్రి వరకు డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావహుల వివరాలను నియోజకవర్గాల వారీగా వేరు చేస్తున్నారు.

మంత్రి ఉత్తమ్‌తో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేల భేటీ- ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై విజ్ఞప్తి

Telangana Lok Sabha Elections : రాష్ట్రంలోని మొత్తం 17 లోక్​సభ నియోజకవర్గాలకు చెంది దాదాపు వంద మంది పార్లమెంట్ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన గాంధీ భవన్‌లో జరగనుంది. ఇప్పటి వరకు డీసీసీల నుంచి వచ్చిన ఆశావహుల వివరాలను నియోజక వర్గాల వారీగా ఓ జాబితాను సిద్దం చేస్తారు. పీఈసీ కమిటీ ఛైర్మన్‌, పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.

CM Revanth Reddy : డీసీసీ అధ్యక్షులు పంపించిన పేర్లను నియోజక వర్గాల వారీగా పీఈసీ పరిశీలిస్తుంది. అర్హులైన నాయకులను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫారసు చేస్తుంది. ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పీఈసీ పంపిన పేర్ల జాబితాపై ఈ కమిటీ చర్చించి అర్హులైన, ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను గట్టిగా ఎదురొడ్డి గెలవగలిగిన సత్తా ఉన్న గెలుపు గుర్రాలను సీఈసీ ఎంపిక చేస్తుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

పార్టీ బలోపేతంపై హస్తం ఫోకస్ - ప్రజావాణి తరహాలో గాంధీభవన్‌లో 'కాంగ్రెస్ వాణి'

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌లో రూ.లక్షతో పాటు తులం బంగారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.