ETV Bharat / state

మంత్రి ఉత్తమ్‌తో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేల భేటీ- ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై విజ్ఞప్తి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 5:21 PM IST

Mahabubnagar MLAs Meet Minister Uttam on Pending Projects : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. ఇవాళ సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో సమావేశమై విజ్ఞప్తి చేశారు.

Mahabubnagar Irrigation Projects
Mahabubnagar MLAs Meet Minister Uttam on Pending Projects

Mahabubnagar MLAs Meet Minister Uttam on Pending Projects : ఉమ్మడి రాష్ట్రంలోనే సుమారు 70శాతం పనులు పూర్తైన ప్రాజెక్టులను కూడా, గత బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం పక్కన పెట్టి పాలమూరు రైతులకు తీరని అన్యాయం చేసిందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో(Minister Uttam) సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

Mahabubnagar Irrigation Projects : నారాయణపేట్‌ - కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై మంత్రితో చర్చించారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరో 2 టీఎంసీలు పెంచాలని కోరారు.

నారాయణపూర్ - కొడంగల్ ఎత్తిపోతలు, పాలమూరు - రంగారెడ్డి, కోయిల సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలని పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ సానూకూలంగా స్పందించారని, జిల్లా ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు అంగీకరించారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు యెమ్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, జి.మధుసూదన్ రెడ్డి, పర్ణికా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం - నీళ్లొచ్చేనా? పంట పండేనా?

Narayanpet Kodangal Irrigation Project : ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీరందని మెట్ట ప్రాంతాల అన్నదాతల చిరకాల స్వప్నం నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం. ఆ కలను సాకారం చేయాలని, ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2014లో జీఓ జారీ అయినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఎన్నో ఉద్యమాలు, పాదయాత్రలు, బహిరంగ సభలు చేపట్టినా ఫలితం దక్కలేదు. పదేళ్ల పాటు మరుగునపడిన ఎత్తిపోతల అంశం ఎన్నికల హామీగా తెరపైకి వచ్చింది.

కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పథకంతో సాగునీరందించి మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ నియోజక వర్గాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అప్పటికే ఉన్న జూరాల, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. కానీ మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ నియోజక వర్గాల్లో మెట్ట ప్రాంతాలకు ఈ పథకాల ద్వారా సాగునీరు అందే అవకాశం లేదు. అందుకే భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన భూత్పూరు జలాశయం నుంచి నాలుగు దశల్లో కానుకుర్తి వరకూ నీళ్లెత్తి పోసి అక్కడి నుంచి గ్రావిటీతో దౌల్తాబాద్, కొడంగల్‌ మీదుగా బొమ్మరాస్ పేట వరకూ చెరువులు నింపిలక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు.

లక్ష్యానికి ఆమడ దూరంలో సాగునీటి ప్రాజెక్టులు - భూసేకరణే ప్రధాన అడ్డంకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.