తెలంగాణ

telangana

PRATHIDWANI ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఐపీవోలతో లాభం

By

Published : Nov 9, 2022, 10:53 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

PRATHIDWANI ఐపీవో అంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఫుల్ క్రేజ్. తగిలిందంటే బంపర్ డ్రా కొట్టినట్లే అని భావిస్తుంటారు చాలామంది. కానీ పరిస్థితులు తలకిందులైన సందర్భాలు అనేకం. ప్రస్తుతం కూడా అంతే. గతేడాది మార్కెట్ల ర్యాలీతో.. ఐపీవోల పట్ల మదుపరుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. క్యాలెండర్‌ ఇయర్ మారగానే పూర్తిగా ఆవిరైంది. అస్థిర మార్కెట్ పరిస్థితులతో కొత్తగా నమోదైన పలు సంస్థలు సబ్‌స్క్రైబ్ ధర కంటే భారీగా పతనమై నిండా ముంచేశాయి. పేటీఎమ్, జొమాటో, నైకా, పాలసీబజార్, ఎల్​ఐసీ లాంటి అగ్రశ్రేణి సంస్థలు సైతం తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఐపీవో అంటేనే తటపటాయించే పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఐపీవోలు ఆశాజనకమేనా.. ఏ జాగ్రత్తలు తీసుకుంటే కాసులు కురిపించే అవకాశం ఉంటుందనేది పెట్టుబడిదారులలో తలేత్తే ప్రశ్న. అంచనాలు తప్పి నష్టాలపాలు కాకూడదంటే మదుపర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే అంశం నేటి ప్రతిధ్వని.
Last Updated :Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details