తెలంగాణ

telangana

మియాపూర్​లో సినిఫక్కీలో చైన్​ స్నాచింగ్ వైరల్​ అవుతున్న సీసీటీవీ వీడియోలు

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 11:53 AM IST

Chain Snatching Took Place in Miyapur

Chain Snatching in Miyapur Video Viral :హైదరాబాద్‌ మియాపూర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు సినీఫక్కీలో మంగళసూత్రం లాక్కెళ్లారు. హఫీజ్‌పేట్‌ వినాయకనగర్‌లో ముగ్గురు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా.. అప్పటికే ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన దుండగుడు.. చోరీకి పాల్పడ్డాడు. వెనుక నుంచి వచ్చి వెంకటలక్ష్మి అనే మహిళ మెడలోంచి ఒక్కసారిగా మంగళసూత్రం దోచుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో వ్యక్తి ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉండగా.. నిందితులిద్దరూ కలిసి పరారయ్యారు. 

ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంకటలక్ష్మి భర్త అదే కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బంగారం వంటి ఖరీదైనవి వేసుకున్నప్పుడు రోడ్డుపై వెళుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చైన్ స్నాచింగ్ కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా రోజూ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details