తెలంగాణ

telangana

'ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలి'

By

Published : Nov 18, 2019, 4:00 PM IST

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని వాసవి క్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు యాద నాగేశ్వర్​ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీనివాస సౌజన్య సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

'ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలి'

ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని వాసవి క్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు యాద నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో నిర్వహించిన శ్రీనివాస సౌజన్య సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లబ్​ కొత్త గవర్నర్​గా కలికోట శ్రీనివాస్​ ప్రమాణ స్వీకారం చేశారు.

సామాజిక సేవ లక్ష్యమే క్లబ్బుల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని నాగేశ్వర్​ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రెండు వేల క్లబ్బులు ఏటా సుమారు 30 కోట్ల రూపాయలతో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. అందరి ఐక్యతతోనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

'ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలి'

ఇదీ చూడండి: బాలుడిని కిడ్నాప్​ చేసిన బాలుడు... రూ.3 లక్షలు డిమాండ్

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఆర్య వైశ్య భవనం లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాసవి క్లబ్ ఎన్నికలు జరిగాయి.

ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలని అంతర్జాతీయ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో నిర్వహించిన శ్రీనివాస సౌజన్య సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక సేవ లక్ష్యమే క్లబ్బుల ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశమన్నారు. సేవలతో సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. రాజకీయ రంగంలో ఆర్యవైశ్యులు రాణించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రెండు వేల క్లబ్బులు ఏటా సుమారు 30 కోట్ల రూపాయలతో సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెడుతుందని తెలిపారు. ఇది అందరి ఐక్యతతోనే సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా గవర్నర్ మాట్లాడుతూ తూ ఏడాది కాలంలో క్లబ్బుల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కొత్త క్లబ్బు లను ఏర్పాటు చేసి ఇ మరింత సేవలను విస్తరించాలని సూచించారు. అంతకుముందు జాతీయ గీతంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 40 క్లబ్బుల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పండగ వాతావరణం ఏర్పడింది. సభ్యులకు సన్మానాలు, జ్ఞాపికలను అందజేశారు. కొత్త గవర్నర్ గా కలికోట శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా


Body:tg_adb_26_18_anni_rangalalo_arya_vaishyulu_mundundali_avb_ts10078


Conclusion:

ABOUT THE AUTHOR

...view details