ETV Bharat / state

బాలుడిని కిడ్నాప్​ చేసిన బాలుడు... రూ.3 లక్షలు డిమాండ్

author img

By

Published : Nov 18, 2019, 9:05 AM IST

Updated : Nov 18, 2019, 12:23 PM IST

హైదరాబాద్ మీర్ పేట్ ఠాణా పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేపింది. బాలుడిని అపహరించి... మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడో పిల్ల ప్రబుద్ధుడు.

బాలుడి కిడ్నాప్... రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన 14 ఏళ్ల ప్రబుద్ధుడు

బాలుడి కిడ్నాప్... రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన 14 ఏళ్ల ప్రబుద్ధుడు

హైదరాబాద్ మీర్ పేట్ ఠాణా పరిధిలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఏడు సంవత్సరాల బాబును 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్​కు స్కెచ్ వేశాడు. కిడ్నాపర్ పదో తరగతి చదువుతున్న మైనర్ కావడం గమనార్హం. డబ్బులిస్తాం రమ్మని పిలిచి పోలీసులు పట్టుకున్నారు. డబ్బులు కోసం నాటకం ఆడి మూడు గంటల పాటు తల్లి దండ్రులు, కాలనీ వాసులు, పోలీసులకు చెమటలు పట్టించాడు. కిడ్నాప్ చేసిన ఇంటి పరిసరాల్లోనే ఉంటూ హైడ్రామా సృష్టించాడు. ఏం చేయాలో తెలియక తల్లి దండ్రులు ఆందోళన పడ్డారు. అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించాడు.

మాటలు కలిపి... అల్మాస్​గూడ తీసుకెళ్లి...

మీర్ పేట్ పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న రాజు ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కొడుకు ఏడేళ్ల అర్జున్ బడంగ్ పేట్ మౌంట్ కార్మెట్ స్కూల్​లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అతనితో మాటలు కలిపి మీర్ పేట్ నుంచి అల్మాస్​గూడ వరకు తీసుకెళ్లాడు కిడ్నాపర్... అక్కడి నుంచి తండ్రి రాజు​కు ఫోన్ చేసి 'మీ కొడుకుని కిడ్నాప్ చేశా'మంటూ బెదిరించాడు. విడుదల చేయాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా... నిందితుడి కాల్ డేటా వివరాలను పరిశీలించిన పోలీసులు అల్మాస్​గూడకి చెందిన వెంకటేష్ పేరుతో అడ్రస్ ఉందని గుర్తించారు. సోదా కోసం అక్కడ ఇంటికి వెళ్తే ఎవ్వరూ లేరు. అప్పుడే నిందితుడి నుంచి మారోమారు పోన్ వచ్చింది.

డబ్బులిస్తాం రా...

డబ్బులు తెచ్చామని... అల్మాస్​గూడ కమాన్ దగ్గరకు వస్తే ఇస్తామని కిడ్నాపర్​కు రాజు చెప్పాడు. బాలుడు కమాన్ దగ్గర రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి : విషాదం: తండ్రి ఆగ్రహం.. కొడుకు బలవన్మరణం

Intro:హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎస్ ఆర్ కాలనీలో కిడ్నాప్ కలకలం, మూడు లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్,
కిడ్నాపర్ పదవ తరగతి చదువుతున్న మైనర్ కావడం గమనార్హం, డబ్బులిస్తాం రమ్మని పిలిచి పట్టుకున్న పోలీసులు. మీర్ పేట్ లో ఏడు సంవత్సరాల బాబును 14 సంవత్సరాల మైనర్ బాలుడు కిడ్నప్ కు స్కెచ్ వేశాడు. ఇదంతా డబ్బులు కోసం ఆడినా నాడకం మూడు గంటల పాటు తల్లి దండ్రులను, కాలనీ వాసులను, పోలీసులను చమటలు పట్టించాడు.కిడ్నప్ చేసిన ఇంటి పరిసరాలలోనే ఉంటు హైడ్రామా క్రియోట్ చేశాడు. ఎంచేయాలో తల్లి దండ్రులకు తెలియక అందోళన పడ్డారు. అందరిని ఉరుకులు పరుగులు పెట్టించాడు. మీర్ పేట్ పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న రాజు ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. రాజ్ కుమర్ కొడుకు అర్జున్(7) బడంగ్ పేట్ మౌంట్ కార్మెట్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అతనితో మాటలు కలిపి మీర్ పేట్ నుంచి అల్మాసుగూడ వరకు తీసుకెళ్ళిన కిడ్నాపర్. అక్కడి నుంచి తండ్రి రాజు కి ఫోన్ చేయగా మీ కొడుకుని కిడ్నాప్ చేశాం అంటూ బెదిరింపులకు పాల్పడుతూ 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తండ్రి కి ఫోన్ ద్వారా సమాచారం అందించిన కిడ్నపర్, కంగుతిన్న తండ్రి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు. అతని పోన్ కాల్ డేటా ఆధారంగా అతడు అల్మాసుగూడ కి చెందిన వెంకటేష్ పేరుతో అడ్రస్ ఉండడంతో అక్కడ కి వెళ్లి ఇంట్లో వెళ్లి సోదాలు చేసిన పోలీసులు. అక్కడ ఏవ్వరు లేకపోవడంతో మరో మారు పోన్ రావడంతో అతని ట్రాఫ్ చేసిన పోలిసులు అల్మాసు గూడ కమన్ దేగ్గరకి రండి అంటు పోన్ లో మాట్లాడిన కిడ్నపర్, దాంతో అల్మాస్ గూడ కమన్ దగ్గర ఉన్న కిడ్నపర్ ను అదుపులోకి తీసుకున్న పోలిసులు. ఇతను వెంకటేష్ కుమారుడు( శివ చరణ్) గా గుర్తించి, గతంలో అతనిపై దొంగతనం ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. డబ్బులు తీసుకు వచ్చామని చెప్పి పట్టుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మీర్ పెట్ పోలీసులు.Body:TG_Hyd_07_18_Minor boy kidnap_Av_TS10012Conclusion:TG_Hyd_07_18_Minor boy kidnap_Av_TS10012
Last Updated :Nov 18, 2019, 12:23 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.